• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI MI AIR PURIFIER 3 TO HONEYWELL AIR TOUCH BUY THESE AIR PURIFIERS WITH HUGE DISCOUNT ON AMAZON GREAT INDIAN FESTIVAL SALE SS GH

Air Purifier: ఎయిర్‌ ప్యూరిఫయర్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు

Air Purifier: ఎయిర్‌ ప్యూరిఫయర్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు

Air Purifier: ఎయిర్‌ ప్యూరిఫయర్లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు (ప్రతీకాత్మక చిత్రం)

Air Purifier | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఎయిర్ ప్యూరిఫయర్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. వివరాలు తెలుసుకోండి.

  • Share this:
భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో గాలి నాణ్యత తగ్గిపోతోందని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు కాలుష్యమే ప్రధాన కారణం. దీంతో ఈ దీపావళికి బాణాసంచాను కూడా రాష్ట్రాలు నిషేధిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫయర్లను వాడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. కొత్త ఎయిర్ ప్యూరిఫయర్ కొనాలనుకునే వారికి అమెజాన్ మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. పండుగ సందర్భంగా ప్రారంభించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాల్లో భాగంగా ఎయిర్ ప్యూరిఫయర్‌లను తక్కువ ధరల్లోనే పొందవచ్చు. సాధారణంగా CADR, ACH, గది పరిమాణం, ధరలు.. వంటి వివరాల ఆధారంగా వీటిని ఎంచుకోవాలి. అమెజాన్లో ఎయిర్ ప్యూరిఫయర్లపై ఉన్న ఆఫర్లు, తగ్గింపుల వివరాలు.

Philips


Philips నుంచి మార్కెట్లోకి వచ్చిన AC1215/20 మోడల్‌ ఎయిర్ ప్యూరిఫయర్‌పై అమెజాన్‌ రూ.2,396 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇది వినియోగదారులకు రూ.9,599కు లభిస్తుంది. ఎనిమిది అడుగుల పైకప్పు, 18ft x 12ft వైశాల్యం ఉండే గదికి ఈ ఫిల్టర్‌ సరిపోతుంది. ఇది నాలుగు దశల్లో గాలిని ఫిల్టర్‌ చేసి, కాలుష్య కణాలను వడకడుతుంది.

iPhone: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపే ఐఫోన్ సొంతం చేసుకోండి... ఇంకొన్ని గంటలే ఆఫర్

Amazon Sale: భారీ డిస్కౌంట్‌తో ఈ 15 స్మార్ట్‌ఫోన్స్ కొనొచ్చు... ఒక్క రోజే అవకాశం

Xiaomi Mi Air Purifier 3


Xiaomi Mi ఎయిర్ ప్యూరిఫయర్‌ 3 మోడల్‌పై అమెజాన్‌లో రూ.3,000 తగ్గింపు ఉంది. దీన్ని వినియోగదారులు రూ.9,999కు సొంతం చేసుకోవచ్చు. 484 చదరపు అడుగుల గదికి ఎమ్‌ఐ ప్యూరిఫయర్ సరిపోతుంది. True HEPA ఫిల్టర్, స్మార్ట్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది.

Blueair Blue Pure 211 Air Purifier


బ్లూ ఎయిర్ బ్లూ ప్యూర్ 211 ఎయిర్ ప్యూరిఫైయర్‌ను అమెజాన్‌ రూ.23,996కు అమ్ముతోంది. HEPASilent టెక్నాలజీ, CADR వంటి ఫీచర్లతో బ్లూ ఎయిర్ ప్యూరిఫయర్ను రూపొందించారు. ఇది 540 చదరపు అడుగుల వైశాల్యం ఉండే గదికి సరిపోతుంది.

Blueair Joy S Air Purifier


బ్లూ ఎయిర్ జాయ్ ఎస్ ఎయిర్ ప్యూరిఫయర్‌పై అమెజాన్ రూ.4,749 తగ్గింపును ప్రకటించింది. ఇది ఇప్పుడు రూ.10,250కు కస్టమర్లకు అందుబాటులో ఉంది. 170 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న చిన్న గదులకు ఈ ఫిల్టర్ సరిపోతుంది. HEPASilent టెక్నాలజీతో బ్లూయిర్ జాయ్ ఎస్ ఎయిర్ ప్యూరిఫయర్ను తయారు చేశారు.

Mobile App: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 7 యాప్స్ డిలిట్ చేయండి

Google Pay: గూగుల్ పే ఉందా? ఈ గేమ్ ఆడితే రూ.501 మీవే

Honeywell Air Touch HAC35M1101G Air Purifier


హనీవెల్ ఎయిర్ టచ్ HAC35M1101G ఎయిర్ ప్యూరిఫయర్‌పై అమెజాన్ రూ.8,661 తగ్గింపును ప్రకటించింది. దీని ప్రస్తుత ధర రూ.17,329. దాదాపు 450 చదరపు అడుగుల వైశాల్యం ఉండే గదికి ఈ ఫిల్టర్ సరిపోతుంది.

Dyson Pure Cool Air Purifier


డైసన్ ప్యూర్ కూల్ ఎయిర్ ప్యూరిఫయర్‌పై అమెజాన్‌ రూ.6,000 తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు ఇది రూ.39,900 కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 600 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న గదుల్లో దీన్ని అమర్చుకోవచ్చు. వై-ఫై, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు దీని సొంతం.
Published by:Santhosh Kumar S
First published: