హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Xiaomi: షావోమీ యూజర్లకు షాక్... సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయగానే ఆ ఫోన్లన్నీ స్విచాఫ్

Xiaomi: షావోమీ యూజర్లకు షాక్... సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయగానే ఆ ఫోన్లన్నీ స్విచాఫ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Xiaomi | మీరు షావోమీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నారా? అయితే అలర్ట్. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయగానే ఫోన్లు స్విచాఫ్ అవుతున్నాయి.

షావోమీ యూజర్లకు అలర్ట్. షావోమీ ఇండియాలో రిలీజ్ చేసిన పాపులర్ ఫోన్లలో ఒక మోడల్ అప్‌డేట్ సమస్యల్ని ఎదుర్కొంటోంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయగానే ఫోన్లు స్విచాఫ్ అవుతున్నాయి. ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. షావోమీ ఇండియా రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇటీవల ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ రిలీజ్ చేస్తోంది షావోమీ. యూజర్లకు నోటిఫికేషన్ రాగానే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నారు. అప్‌డేట్ చేసిన తర్వాత ఏ సాఫ్ట్‌వేర్ అయినా అంతకుముందు కంటే బాగా పనిచేస్తుంది. ఫీచర్స్ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ చేయగానే ఫోన్లు స్విచాఫ్ అవుతున్నాయి. మళ్లీ ఆన్ కూడా కావట్లేదు. ట్విట్టర్‌లో సోషల్ మీడియాలో ఎంఐ ఏ3 యూజర్లు ఇదే విషయంపై కంప్లైంట్లు చేస్తున్నారు.

Xiaomi Mi 11: కేవలం 5 నిమిషాల్లో 3,50,000 స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి... ఈ మోడల్ ప్రత్యేకత ఏంటంటే

WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్‌తో మీ వాట్సప్ సేఫ్... వెంటనే మార్చేయండి

ఎంఐ ఏ3 యూజర్ల నుంచి వస్తున్న కంప్లైంట్స్‌పై షావోమీ స్పందించింది. కొందరు యూజర్లు ఆండ్రాయిడ్ 11 ఓటీఏ అప్‌డేట్ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తమ వైపు నుంచి అప్‌డేట్ ఆపేశామని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 11 డౌన్‌లోడ్ చేసిన కస్టమర్లు అప్‌డేట్ చేయొద్దని కంపెనీ కోరుతోంది. యూజర్లకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అందించేందుకు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ రిలీజ్ చేసింది షావోమీ.

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్

Jio New Year Gift: యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన జియో... ఏంటో తెలుసుకోండి

గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంఐ ఏ3 రిలీజైంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ యూజర్లకు లభిస్తుంది. గూగుల్ రిలీజ్ చేసే అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ ముందుగా ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్లకు వస్తాయి. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో కేవలం గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చెందిన ఇతర యాప్స్ ఏవీ ఉండవు. అంటే షావోమీ ఫోన్లలో ఎంఐ పే, ఎంఐ వీడియో లాంటి యాప్స్ డిఫాల్ట్‌గా వస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ ఆండ్రాయిడ్ వన్ ఫోన్లలో ఇలాంటి యాప్స్ ఏవీ ఉండవు. థర్డ్ పార్టీ యాప్స్, డిఫాల్ట్ యాప్స్, బ్లోట్ వేర్ వద్దనుకునేవారు ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

First published:

Tags: Android, Android 11, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Xiaomi

ఉత్తమ కథలు