ఛార్జింగ్‌లో ఉండగా పేలిన షావోమీ ఎంఐ ఏ1

తన స్నేహితుడికి చెందిన షావోమీ ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పేలిపోయిందని ఎంఐయూఐ ఫోరమ్‌ సభ్యుడు వెల్లడించారు. ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోవడంతో ఫోన్ పేలిపోయినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 3, 2018, 12:04 PM IST
ఛార్జింగ్‌లో ఉండగా పేలిన షావోమీ ఎంఐ ఏ1
image: @nexsad MIUI forums
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆ కంపెనీకి చెందిన ఫోన్లు అప్పుడప్పుడూ పేలుతూ ఉండటం యూజర్లకు ఝలక్ ఇస్తోంది. ఇలా పేలిన ఫోన్లల్లో షావోమీ రెడ్‌మీ నోట్ 4 ఫోన్లే ఎక్కువ. ఇప్పుడు షావోమీ ఎంఐ ఏ1 కూడా ఈ లిస్ట్‌లో చేరింది. తన స్నేహితుడికి చెందిన షావోమీ ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా పేలిపోయిందని ఎంఐయూఐ ఫోరమ్‌ సభ్యుడు వెల్లడించారు.

సదరు వ్యక్తి రాత్రి సమయంలో ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోవడంతో ఫోన్ పేలిపోయినట్టు తెలుస్తోంది. ప్రొటెక్టీవ్ కేస్ పూర్తిగా కాలిపోయింది. ఫోన్ బాగా డ్యామేజ్ అయింది. అయితే సదరు వ్యక్తికి ఎలాంటి గాయం కాలేదు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేలిపోయిన ఫోన్ ఫోటోలను ఫోరమ్‌లో అప్‌లోడ్ చేశాడు. వాస్తవానికి ఎంఐ ఏ1 విషయంలో ఇలాంటి ఫిర్యాదులు ఇప్పటివరకు రాలేదు. షావోమీ నుంచి వచ్చిన సక్సెస్‌ఫుల్ ఫోన్లల్లో ఇది ఒకటిగా రికార్డు సృష్టించింది. దాంతో ఇటీవలే ఎంఐ ఏ2, ఏ2 లైట్ లాంఛ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

షావోమీ నుంచి ఐదు కొత్త ప్రొడక్ట్స్!

నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 6 ప్రో

Photos: టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

మెసేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసే మొబైల్ కీబోర్డ్!సైబర్ క్రైమ్‌ నుంచి కాపాడే ఇన్సూరెన్స్‌ పాలసీలివే!
Published by: Santhosh Kumar S
First published: October 3, 2018, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading