Xiaomi: జూన్ 12న షావోమీ కొత్త ఫోన్ ఎంఐ 9టీ రిలీజ్

Xiaomi Mi 9T | ఎంఐ 9టీ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర గురించి ఎలాంటి వివరాలు తెలియవు. లాంఛ్ రోజునే ఈ వివరాలు తెలిసే అవకాశముంది.

news18-telugu
Updated: June 4, 2019, 2:47 PM IST
Xiaomi: జూన్ 12న షావోమీ కొత్త ఫోన్ ఎంఐ 9టీ రిలీజ్
Xiaomi: జూన్ 12న షావోమీ కొత్త ఫోన్ ఎంఐ 9టీ రిలీజ్ (image: Xiaomi)
news18-telugu
Updated: June 4, 2019, 2:47 PM IST
షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరో కొత్త ఫోన్ రిలీజ్ చేయనుంది షావోమీ. ఎంఐ 9టీ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 12 రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. రెడ్‌మీ కే20 మోడల్‌ను రీబ్రాండ్ చేసి ఎంఐ 9టీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఎంఐ 9టీ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర గురించి ఎలాంటి వివరాలు తెలియవు. లాంఛ్ రోజునే ఈ వివరాలు తెలిసే అవకాశముంది. అయితే పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంటుందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండబోతున్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు కాబట్టి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చని భావిస్తున్నారు.


చైనాలో రిలీజ్ కాబోయే ఎంఐ 9టీ స్పెసిఫికేషన్స్ అధికారికంగా తెలియకపోయినా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. 48+13+8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటాయని భావిస్తున్నారు. ఇక రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ను త్వరలో ఇండియాలో రిలీజ్ చేసేందుకు షావోమీ ఏర్పాట్లు చేస్తోంది. మరో ఆరు వారాల్లో ఈ ఫోన్లు ఇండియాలో రిలీజ్ అవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇండియాలో పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ బదులు రెడ్‌మీ కే20 ప్రో రిలీజ్ చేస్తారని అంచనా.



Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో
Loading...

ఇవి కూడా చదవండి:

Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

Xiaomi: షావోమీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్

Swiggy Daily: స్విగ్గీ నుంచి 'డైలీ' యాప్... ఇక రోజూ ఇంటి భోజనం
First published: June 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...