Xiaomi Mi 11 Lite Review: డిజైన్, లుక్స్​ సూపర్​.. స్పెసిఫికేషన్స్ కూడా.. షియోమీ ఎంఐ 11 లైట్ డివైజ్ పూర్తి రివ్యూ

(image: Redmi India)

వాల్యూ ఫర్ మనీ స్మార్ట్​ఫోన్లు తీసుకురావడంలో షియోమీ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే 10 సిరీస్​లో రెడ్​మీ నోట్ 10, ఎంఐ 10ఐ సిరీస్​లో ఫోన్లు మంచి స్పెసిఫికేషన్లతో ఉన్నాయి. ఎంఐ 11ఎక్స్ కూడా ధరకు తగ్గట్టే టాప్ స్పెక్స్​తో ఉంది. అయితే డిజైన్ ప్రధాన ఆకర్షణగా ఎంఐ 11 లైట్​ 4జీను భారత్​లో లాంచ్ చేసింది షియోమీ.

  • Share this:
వాల్యూ ఫర్ మనీ స్మార్ట్​ఫోన్లు తీసుకురావడంలో షియోమీ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే 10 సిరీస్​లో రెడ్​మీ నోట్ 10, ఎంఐ 10ఐ సిరీస్​లో ఫోన్లు మంచి స్పెసిఫికేషన్లతో ఉన్నాయి. ఎంఐ 11ఎక్స్ కూడా ధరకు తగ్గట్టే టాప్ స్పెక్స్​తో ఉంది. అయితే డిజైన్ ప్రధాన ఆకర్షణగా ఎంఐ 11 లైట్​ 4జీను భారత్​లో లాంచ్ చేసింది షియోమీ. వాల్యూ ఫర్ మనీ సూత్రాన్నే పాటిస్తూ దీన్ని రూ.21,999 నుంచి తీసుకొచ్చింది. దీంతో రూ.25వేల లోపు ఇది బెస్ట్ ఫోన్​గా ఉందా.. అసలు పర్ఫార్మెన్స్, స్క్రీన్​ , డిజైన్ ఎలా ఉందో చూడండి.

డిజైన్​: గ్లాస్​ బాడీతో ప్రీమియం​గా ఎంఐ 11 లైట్ 4జీ మోడల్​ లుక్స్ చాలా బాగున్నాయి. అందులోనూ 6.81 మిల్లీమీటర్లతో స్లిమ్​గా ఉండడంతో చూసేందుకు ప్రీమియం స్మార్ట్​ఫోన్​లా ఉంటుంది. బరువు కూడా 157 గ్రాములు మాత్రమే ఉండడంతో చేతిలో పట్టుకునేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఫ్రేమ్ ప్లాస్టిక్​తో తయారు చేసినా చేతిలో నుంచి జారేలా లేదు. కలర్లు కూడా విభిన్నంగా ఉన్నాయి. ఎంఐ 11 లైట్​ టుస్కనీ ఆరంజ్, జాజ్ బ్లూ ఆప్షన్లలో వస్తోంది. అలాగే వినైల్​ బ్లాక్ కలర్ కూడా అందుబాటులో ఉన్నా దానిపై పింగర్​ప్రింట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఫోన్ మరీ స్లిమ్​గా తీసుకొచ్చేందుకు షియోమీ 3.5 ఎంఎం హెడ్​ఫోన్ జాక్​ను తీసేసింది. సింగిల్​ స్పీకర్​ హైరెస్ సెటప్​తో ఉంది.

డిస్​ప్లే: డిస్​ప్లే విషయంలోనూ ఎంఐ 11 లైట్​ సూపర్​గా ఉంది. 6.55 ఇంచుల హెడ్​డీ ప్లస్ అమోలెడ్ డాట్​ డిస్​ప్లేతో ఉంది. అలాగే హెచ్​డీఆర్ 10 సర్టిఫికేట్​ కూడా ఉంది. డిస్​ప్లే మంచి కాంట్రాస్ట్​, బ్రైట్​నెస్​, వ్యూయింగ్ యాంగిల్స్​తో ఆకట్టుకుంటుంది. అయితే టిల్టెడ్ యాంగిల్​లో నుంచి చూస్తే కలర్ షిఫ్ట్ కొన్ని సార్లు ఉంటుంది. 90 గిగాహెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉండడంతో స్క్రోలింగ్ కూడా స్మూత్​గా అనిపిస్తుంది.

సాఫ్ట్​వేర్, పర్ఫార్మెన్స్​: ఎంఐ 11 లైట్​ ఎంఐయూఐ 12తో వస్తుంది. కొన్ని ప్రిఇన్​స్టాల్డ్ యాప్స్​ ఉన్నా వాటిని తీసివేయవచ్చు. కస్టమ్ ఆండ్రాయిడ్ 11 స్కిన్​తో వస్తుండడంతో ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఎంఐయూఐలో ఉండే సెకండ్ స్పేస్​, డ్యుయల్ యాప్స్​, యానిమేషన్స్​, గేమ్ మోడ్​ లాంటి అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్లో స్నాప్​డ్రాగన్​ 732జీ ప్రాసెసర్ ఉండడంతో గేమింగ్​ కూడా స్మూత్​గా ఉంది. బ్యాటిల్ గ్రౌండ్​ మొబైల్ ఇండియా, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ కూడా ఈ ఫోన్​లో హెచ్​డీ గ్రాఫిక్స్​లో రన్ అవుతున్నాయి. క్యాజువల్ గేమర్స్​కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ గేమ్సే చాలా ముఖ్యమైతే పోకో ఎక్స్​ 3 లేదా ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేసి రియల్ మీ ఎక్స్ 7 మ్యాక్స్​, ఐక్యూ 7 5జీ ఫోన్లను పరిశీలించవచ్చు. ఎంఐ 11 లైట్​లో 6, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లతో ఉండడంతో ఆ విషయంలోనూ ఎలాంటి సమస్య లేదు.

బ్యాటరీ: ఎంఐ 11 లైట్​ స్లిమ్​గా ఉన్నా బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. ఇందులో 4,250 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. సులువుగా ఒకరోజు నడుస్తుంది. ఒకవేళ ఎక్కువగా గేమ్స్​, కెమెరా వాడితే సాయంత్రం వరకు వస్తుంది. ఒకవేళ గేమ్స్ ఎక్కువగా వారికైతే స్క్రీన్ ఆన్ టైమ్​ 6 నుంచి 7 గంటల వరకు వస్తుంది. చార్జింగ్ కోసం 30 వాట్స్ చార్జర్​ బాక్స్​లో వస్తుంది. 0 నుంచి 100 శాతం చార్జింగ్ గంటలో పూర్తవుతుంది.

కెమెరా: ఎంఐ 11 లైట్​లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 5 ఎంపీ టెలీ మ్యాక్రో లెన్స్ కెమెరాలు వెనుక ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 64 కెమెరా, టెలీ మాక్రో లెన్స్​ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మెయిన్ కెమెరాతో డే లైట్​లో మంచి డిటైల్స్​తో ఫొటోలు వస్తాయి. లో లైట్​లో కూడా ఫర్వాలేదనిపిస్తుంది. సాచురేషన్ కాస్త ఎక్కువగా ఉన్నా సోషల్ మీడియా వాడే చాలా మందికి ఇది నచ్చుతుంది. 8 ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరా డీసెంట్ పిక్చర్స్ తీసినా.. డిటైల్స్ సరిగా క్యాప్చర్ చేయడం లేదు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా మంచి ఫోటోలు తీయగదు. స్కిన్ స్మూతినింగ్ కూడా కంట్రోల్​లోనే ఉండడంతో రియల్ కలర్ ఫోటోస్ వస్తున్నాయి. పోట్రయిట్​ మోడ్​లో ఎడ్జ్ డిటెక్షన్​ కూడా ఎక్కువ సార్లు యాక్యురేట్​గా ఉంది.

మొత్తంగా: స్లిమ్​, లైట్​వైట్​తో ఉంటూ మంచి స్పెసిఫికేషన్లు ఉన్న ఫోన్​గా ఎంఐ 11 లైట్ నిలుస్తుంది. స్పెక్స్​ను పరిశీలిస్తే మరీ ధర ఎక్కువగా ఉన్నట్టు కనిపించదు. రెడ్​మీ నోట్​ 10 ప్రో మ్యాక్స్​, పోకో ఎక్స్ 3, ఎంఐ 10 ఐ, ఐకూ జెడ్​ 3తో పోలిస్తే స్పెక్స్ తక్కువగానే ఉన్నా… వాటి కంటే చాలా స్లిమ్​గా, ఆకర్షణీయంగా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. మంచి డిజైన్​, లైట్ వైట్​ ఫోన్ కావాలనుకునే వారికి మాత్రం ఎంఐ 11 లైట్​ చాలా నచ్చుతుంది.
Published by:Krishna Adithya
First published: