Home /News /technology /

XIAOMI MI 11 LITE 5G ANNOUNCED SPECIFICATIONS 6 55 INCH FHD PLUS AMOLED 90HZ DISPLAY SNAPDRAGON 780G 64MP TRIPLE REAR CAMERAS HERE FULL DETAILS NS GH

Xiaomi Mi 11 Lite: ఎంఐ 11 సిరీస్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్లు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సరి కొత్త ఫీచర్లతో ఫోన్లను లాంఛ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న షియోమి తన ఎంఐ 11 సిరీస్​లో నాలుగు ఫోన్లను లాంఛ్ చేసింది. ఎంఐ 11 ప్రో, ఎంఐ11 అల్ట్రా, ఎంఐ 11 లైట్, ఎంఐ 11 లైట్ 5 జి స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్​లోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమి భారత మార్కెట్​లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను లాంఛ్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. తాజాగా, షియోమి తన ఎంఐ 11 సిరీస్​లో నాలుగు ఫోన్లను లాంఛ్ చేసింది. ఎంఐ 11 ప్రో, ఎంఐ11 అల్ట్రా, ఎంఐ 11 లైట్, ఎంఐ 11 లైట్ 5 జి స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. వీటిలో అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఎంఐ 11 ప్రో, అల్ట్రా వేరియంట్లను ఇదివరకే విడుదల చేయగా, ప్రస్తుతం ఎంఐ 11 లైట్​ 4జీ, 5జీ రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఎంఐ 11 లైట్ 5 జి మొత్తం మూడు కలర్​ వేరియంట్లు ట్రిఫుల్ బ్లాక్, మింట్ గ్రీన్, సిట్రస్ ఎల్లో కలర్లలో లభిస్తుంది. కాగా, చైనాలో అయితే ఇది స్వీట్ లిచీ, చెర్రీ పింక్, కూల్ బ్లూ వంటి అదనపు రంగుల్లో కూడా లభిస్తుంది. వీటి ధర విషయానికి వస్తే.. 128 జీబీ స్టోరేజ్​, 6 జీబీ ర్యామ్ మోడల్​కు 369 యూరోలు (యుఎస్ $ 434 / రూ. 31,600 సుమారు), 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడల్​కు 2299 యువాన్లు (యుఎస్ $ 349 / రూ. 25,460.)గా నిర్ణయించింది. ఇక, 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్​ 2599 యువాన్ (యుఎస్ $ 395 / రూ. 28,780)లకు లభిస్తుంది. వీటి అమ్మకాలు చైనాలో ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయి. భారత్​లో అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టతలేదు.

ఎంఐ 11 లైట్ 4జీ, 5 జీ స్పెసిఫికేషన్లు..
1. ఈ రెండింటిలో 6.55- అంగుళాల డిస్​ప్లేతోను అందించారు. ఇది 90Hz, 20: 9 రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్​ ఇస్తుంది. దీనిలో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​ను కూడా చేర్చింది.
2. 4 జీ వేరియంట్​లో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 732G 8nm ప్రాసెసర్, ​అడ్రినో 618 GPU మొబైల్ ప్లాట్‌ఫాంను అందించింది.
3. 5 జీ వేరియంట్​- ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 780G 5nm ప్రాసెసర్​, అడ్రినో 642 GPU తో మొబైల్ ప్లాట్‌ఫాంతో పనిచేస్తుంది.
4. 64GB /128GB (UFS 2.2) స్టోరేజ్, 6GB / 8GB LPDDR4X RAM, మైక్రో SD కార్డు సహాయంతో స్టోరేజీ విస్తరణను అందించింది.
5. MIUI 12తో Android 11 ఆపరేటింగ్​ సిస్టమ్​ను అందించింది.
6. డ్యూయల్​ సిమ్ సపోర్ట్​

7. f / 1.79 ఎపర్చర్‌తో కూడిన 64MP వెనుక కెమెరా, LED ఫ్లాష్, f / 2.2 ఎపర్చర్‌తో కూడిన 8MP 119 ° అల్ట్రా-వైడ్ సెన్సార్, f / 2.4 ఎపర్చర్‌తో కూడిన 5MP టెలిమాక్రో కెమెరాలను అందించింది.
8. 16MP (4G) / 20MP (5G) ఫ్రంట్​ సెల్ఫీ కెమెరాను అందించింది.
9. సైడ్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్
10. యుఎస్‌బి టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో
11. 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (5G) / 802.11 ac (2.4GHz + 5GHz) (4G), VoWiFi, బ్లూటూత్ 5.2 (4G లో 5.1), GPS / GLONASS / Beidou, USB Type-C, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించింది.
12. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో కూడిన 4250 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Redmi, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు