Xiaomi Mi 11: షియోమి నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్లు ఇవే.. భారత మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమి 2021 ఏడాదిలో ఎంఐ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వర్చువల్ అవతార్‌లో మొదటిసారి జరుగుతున్న క్వాల్‌కామ్ స్నాప్డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో షియోమి సహ వ్యవస్థాపకుడు లీ జూన్ ఈ మేరకు ప్రకటన చేశారు.

news18-telugu
Updated: December 4, 2020, 1:09 PM IST
Xiaomi Mi 11: షియోమి నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్లు ఇవే.. భారత మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే?
ప్రతీకాత్మక చిత్రం (Image: YouTube/ TechDroider)
  • Share this:
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమి 2021 ఏడాదిలో ఎంఐ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వర్చువల్ అవతార్‌లో మొదటిసారి జరుగుతున్న క్వాల్‌కామ్ స్నాప్డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో షియోమి సహ వ్యవస్థాపకుడు లీ జూన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఎంఐ నుంచి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తున్న మొదటి 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ సమ్మిట్లో షియోమి సహ వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈఓ లీ జూన్ మాట్లాడుతూ.. “గత దశాబ్ద కాలంలో, షియోమీ విడుదల చేసిన మొదటి తరం మొబైల్ ఫోన్ల నుండి 10వ వార్షికోత్సవంలో విడుదలైన షియోమి 10 సిరీస్ వరకు, అన్ని స్మార్ట్ఫోన్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు అత్యంత అధునాతన మొబైల్ అనుభవాలను అందించడానికి క్వాల్కమ్ టెక్నాలజీస్‌తో చేతులు కలిపాం. క్వాల్‌కామ్ టెక్నాలజీస్ నుండి వస్తున్న స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీతో పనిచేసే అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్గా ఎంఐ 11 నిలుస్తుంది.

మొబైల్ ఇండస్ట్రీలో 5జి కనెక్టివిటీతో పాటు, AI, గేమింగ్, అద్భుతమైన కెమెరా పనితీరు, ఆవిష్కరణలను షియోమీ తీసుకువచ్చింది. కాగా, నూతనంగా విడుదల కాబోయే మా కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 11 స్నాప్‌డ్రాగన్ 888 SoCతో పనిచేసే మొదటి డివైజ్ అని చెప్పేందుకు సంతోషిస్తున్నాము. ఇది మా నుండి వస్తున్న మరొక అత్యాధునిక ఉత్పత్తి. ఇది వివిధ హార్డ్కోర్ టెక్నాలజీలతో లోడ్ అయి వస్తుంది. ” అని అన్నారు. కాగా, ఈ స్మార్ట్ఫోన్‌ జనవరిలో లాంచ్ కానుందని ప్రాధమిక సమాచారం. ఎంఐ 11 గతేడాది లాంచ్ అయిన ఎంఐ 10కు తర్వాతి వెర్షన్గా రానుంది. షియోమీ లాంచ్ చేయబోయే అద్భుతమైన ఉత్పత్తి ఇదేనని తెలుస్తోంది.

రాబోయే రెండు నెలల్లో విడుదలయ్యే అవకాశం..
కాగా, ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి మిగతా వివరాలను షిమోమీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్లో 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6జీబీ ర్యామ్ ఉండనుందని తెలుస్తోంది. అంతేకాక, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో వచ్చే క్యూహెచ్ డీ ప్లస్ డిస్ప్లేను అందించనున్నారు. ఎంఐ 11తో పాటు ఎంఐ11 ప్రో కూడా జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రెండు ఫోన్లు పనిచేయనున్నాయి. ఈ రెండింట్లోనూ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ను అందించే అవకాశం ఉంది.

ఎంఐ 11 మాత్రమే కాకుండా మరిన్ని ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో 6వ తరం AI ఇంజిన్, సరికొత్త హెక్సాగాన్ కో-ప్రాసెసర్, హయ్యర్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రా ISP, క్వాల్‌కామ్ అడ్రినో GPU వంటి వాటిని అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాబోయే రెండు నెలల్లో ఎంఐ 11 లాంచ్ అవుతుందనే ఊహాగానాల వస్తున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by: Nikhil Kumar S
First published: December 4, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading