Xiaomi: షియోమి సంచలనం.. 108 MP కెమెరాతో నాలుగు స్మార్ట్‌ఫోన్లు..

Xiaomi: తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ సంచనాలు సృష్టిస్తున్న షియోమి మరో సంచలనానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే 108 ఎంపీ కెమెరా ఉండే స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది ఆ సంస్థ.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 6, 2019, 12:33 PM IST
Xiaomi: షియోమి సంచలనం.. 108 MP కెమెరాతో నాలుగు స్మార్ట్‌ఫోన్లు..
షియోమి
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 6, 2019, 12:33 PM IST
తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ సంచనాలు సృష్టిస్తున్న షియోమి మరో సంచలనానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే 108 ఎంపీ కెమెరా ఉండే స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది ఆ సంస్థ. ఇప్పటికే సామ్‌సంగ్ 108 ఎంపీ ఇసోసెల్ బ్రైట్ హెచ్‌ఎమ్‌ఎక్స్ కెమెరా సెన్సర్‌‌ను స్మార్ట్‌ఫోన్లను వాడతామని తెలిపిన షియోమి బృందం.. ఇప్పుడు ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఆ నాలుగు ఫోన్లకు కోడ్ పేర్లు.. టుకానా, డ్రాకో, ఉమి, సిమి అని పెట్టారు. అయితే, మిగతా ఎలాంటి ఫోన్ల ప్రత్యేకతలను కంపెనీ విడుదల చేయలేదు. మ్యాక్స్4 ఫోన్ 108 ఎంపీ కెమెరాతో రానుందని ప్రచారం సాగినా, అది రూమర్ మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, సామ్‌సంగ్ ఇప్పటికే ఇసోసెల్ బ్రైట్ హెచ్‌ఎమ్‌ఎక్స్ కెమెరా సెన్సర్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది. ఆ కెమెరా సెన్సర్‌తో 12,032*9024 పిక్సెల్ రిజొల్యుషన్‌తో ఫోటోలు తీయవచ్చు. 0.8మైక్రోమీటర్ పిక్సెల్ పరిమాణంలో వస్తోందీ సెన్సర్. అంటే.. డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల్లో మాదిరిగా ఫోటోల నాణ్యత ఉండనుంది.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...