Home /News /technology /

XIAOMI MAY PROVIDE 200W FAST CHARGER WITH SMARTPHONES SOON SS

Smartphone Charging: 5 నుంచి 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్

Smartphone Charging: 5 నుంచి 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్
(ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Charging: 5 నుంచి 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Charging | స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిశీలిస్తోంది షావోమీ. ఈ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌ను 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు.

    మీ స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఛార్జర్ కెపాసిటీని బట్టి ఈ సమయం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఓ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ చేయాలంటే 1-2 గంటలు సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటే అంతకన్నా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. రియల్‌మీకి చెందిన 65వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను 40 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. ఇదే కాదు రియల్‌మీ 125వాట్ ఛార్జర్‌ను కూడా రూపొందించింది. 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేయొచ్చు. ఒప్పో కూడా 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని రూపొందించింది. ఇప్పుడు షావోమీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై పనిచేస్తోంది. ఏకంగా 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను రూపొందిస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్‌ను 5 నుంచి 10 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు.

    Mi Notebook 14 Horizon Edition: ఈ ల్యాప్‌టాప్‌పై రూ.5,000 డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని రోజులే

    Jio Plans: వ్యాపారులకు శుభవార్త... జియో నుంచి ప్రత్యేక ప్లాన్స్

    ప్రస్తుతం షావోమీ ఏకంగా 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని రూపొందిస్తుందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. వైర్డ్, వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని 200వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందించే అవకాశం ఉంది షావోమీ. ఈ ఏడాదిలోనే షావోమీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావొచ్చు. షావోమీ త్వరలో రిలీజ్ చేయబోయే ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్‌తో 200వాట్ ఛార్జర్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. లేదా ఎంఐ మిక్స్ స్మార్ట్‌ఫోన్‌కు ఈ ఛార్జర్ ఇవ్వొచ్చు.

    Flipkart Smartphone Carnival: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ కార్నివాల్... ఈ 20 మోడల్స్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్

    RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు ఫ్రీ వైఫై... ఆ తర్వాత ఎంత చెల్లించాలంటే

    ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్లకు 5వాట్ ఛార్జింగ్ ఉండేది. ఆ తర్వాత 10వాట్ ఛార్జర్లు వచ్చాయి. కొన్నాళ్లకు 18వాట్, 33వాట్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం షావోమీ స్మార్ట్‌ఫోన్లలో 33వాట్ ఛార్జర్లను ఇస్తోంది. రియల్‌మీ 65వాట్ ఛార్జర్లను ఇస్తోంది. అంతకన్నా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని రియల్‌మీ పరీక్షించినా ఇంకా ఛార్జర్లను ఇవ్వట్లేదు. గతంలో ఎంఐ 10 ఎక్స్‌స్ట్రీమ్ కమ్మొమొరేటీవ్ ఎడిషన్‌కు 120వాట్ వైర్డ్ ఛార్జింగ్, 55వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 10వాట్ రివర్స్ ఛార్జింగ్ అందించింది షావోమీ. ఛార్జింగ్ కెపాసిటీ పెరిగితే బ్యాటరీ ఛార్జ్ అయ్యే సమయం చాలా తగ్గుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు