Xiaomi Mi CC9: యూత్ కోసం షావోమీ నుంచి మరో ఫోన్

Xiaomi Mi CC9 | ఎంఐ సీసీ9 యూత్‌ని టార్గెట్ చేస్తూ షావోమీ తీసుకొస్తున్న సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్. Mi CC9 స్మార్ట్‌ఫోన్‌తో పాటు Mi CC9e మోడల్ కూడా షావోమీ రిలీజ్ చేయనుందని అంచనా.

news18-telugu
Updated: June 26, 2019, 11:35 AM IST
Xiaomi Mi CC9: యూత్ కోసం షావోమీ నుంచి మరో ఫోన్
Xiaomi Mi CC9: యూత్ కోసం షావోమీ నుంచి మరో ఫోన్ (image: Weibo)
  • Share this:
యూత్‌ని టార్గెట్ చేసి షావోమీ కొత్త ఫోన్ రిలీజ్ చేయబోతోంది. షావోమీ నుంచి ఎంఐ సీసీ సిరీస్ రాబోతోంది. Mi CC9 స్మార్ట్‌ఫోన్‌ను జూలై 2న రిలీజ్ చేయనుంది షావోమీ. ఈ ఫోన్‌ ఎలా ఉంటుందో షావోమీ ప్రొడక్ట్ మేనేజర్ ఓ ఫోటోను చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేశారు. జూలై 2న చైనాలో మాత్రమే ఎంఐ సీసీ9 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న స్పష్టత అయితే ప్రస్తుతానికి లేదు. ట్రిపుల్ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఎంఐ సీసీ9 యూత్‌ని టార్గెట్ చేస్తూ షావోమీ తీసుకొస్తున్న సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్. Mi CC9 స్మార్ట్‌ఫోన్‌తో పాటు Mi CC9e మోడల్ కూడా షావోమీ రిలీజ్ చేయనుందని అంచనా.

ఎంఐ సీసీ9 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్‌ప్లే: 6.39 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 730
రియర్ కెమెరా: 48+16+12 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+ఎంఐయూఐ 10

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

WhatsApp: పాత ఫోన్లల్లో వాట్సప్ బంద్... కొత్త ఫోన్ కొనాల్సిందే

Video: టిక్ టాక్‌లో తుమ్మితే ఏం జరిగిందో చూడండి

Mi Trimmer: షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ
Published by: Santhosh Kumar S
First published: June 26, 2019, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading