Redmi Note 9 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన రెడ్‌‌మీ నోట్ 9 ప్రో... ధర రూ.12,999

Redmi Note 9 Pro Series | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? షావోమీ నుంచి రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది షావోమీ.

news18-telugu
Updated: March 13, 2020, 9:48 AM IST
Redmi Note 9 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన రెడ్‌‌మీ నోట్ 9 ప్రో... ధర రూ.12,999
Redmi Note 9 Pro: రెడ్‌‌మీ నోట్ 9 ప్రో వచ్చేసింది... అదిరిపోయిన ఫీచర్స్ (image: Xiaomi India)
  • Share this:
షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 9 సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్‌లో రెడ్‌‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. కరోనా వైరస్ ప్రభావంతో ఆన్ గ్రౌండ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసిన షావోమీ... ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ఈ రెండు ఫోన్లను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. రెడ్‌మీ నోట్ 9 సిరీస్‌లో మూడు ఫోన్లను రిలీజ్ చేస్తుందని అనుకున్నా కేవలం రెండు ఫోన్లను మాత్రమే ప్రకటించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో ఇస్రోకు చెందిన నావిక్ టెక్నాలజీ ఉంది. స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాససెర్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5020 ఎంఏహెచ్ ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి. అయితే రెడ్‌మీ నోట్ 9 ప్రో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

రెడ్‌మీ నోట్ 9 ప్రో 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.12,999. మార్చి 17న సేల్ ప్రారంభమవుతుంది. రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.14,999. మార్చి 25న సేల్ ప్రారంభమవుతుంది. ఈ రెండు ఫోన్లు షావోమీ ఆన్‌లైన్ స్టోర్ mi.com, అమెజాన్, ఎంఐ హోమ్ స్టోర్లలో లభిస్తాయి. రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు తెలుసుకునేందుకు ఈ చార్ట్ చూడండి.































































 రెడ్‌‌మీ నోట్ 9 ప్రో  రెడ్‌‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్
 డిస్‌ప్లే  6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400x1080 పిక్సెల్స్  6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2400x1080 పిక్సెల్స్
 ర్యామ్  4జీబీ, 6జీబీ  6జీబీ, 8జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  64జీబీ, 128జీబీ  64జీబీ, 128జీబీ
 ప్రాసెసర్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720జీ
 రియర్ కెమెరా  48 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్  64 (ప్రైమరీ)+8 (వైడ్ యాంగిల్)+5 (మ్యాక్రో)+2 (డెప్త్) మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  16 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే  కెమెరా  32 మెగాపిక్సెల్ ఇన్ డిస్‌ప్లే కెమెరా
 బ్యాటరీ  5020 ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)  5020 ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 10  ఆండ్రాయిడ్ 10
 సిమ్ సపోర్ట్  డ్యుయెల్ సిమ్  డ్యుయెల్ సిమ్
 కలర్స్  అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్  అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్
 ధర:  4జీబీ+64జీబీ- రూ.12,999
6జీబీ+128జీబీ- రూ.15,999
 6జీబీ+64జీబీ- రూ.14,999
6జీబీ+128జీబీ- రూ.16,999
8జీబీ+128జీబీ- రూ.18,999

ఇవి కూడా చదవండి:

SBI News: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకు తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే

Save Money: కోటీశ్వరులు కావాలా? ఈ జపనీస్ టెక్నిక్ ట్రై చేయండి

అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ ఫ్రీ... పొందండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: March 13, 2020, 9:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading