Mi Smart TV: ఎంఐ నుంచి రానున్న మరో స్మార్ట్​ టీవీ... ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Mi Smart TV: ఎంఐ నుంచి రానున్న మరో స్మార్ట్​ టీవీ... ధర, ఫీచర్ల వివరాలు ఇవే (image: Xiaomi India)

Mi Smart TV | షావోమీ నుంచి మరో స్మార్ట్ టీవీ ఇండియాలో లాంఛ్ అయింది. 40 అంగుళాల స్మార్ట్ టీవీని పరిచయం చేసింది షావోమీ.

  • Share this:
మొబైల్​ ఫోన్స్​తో పాటు టీవీల అమ్మకాల్లోనూ చైనా సంస్థ షావోమీ దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త మోడళ్లను తెస్తోంది. ఇప్పటికే ఉన్న సిరీస్​ల్లో కొత్త ఎడిషన్​లను తీసుకొస్తోంది. ఇదే రీతిలో ఎంతో హిట్టయిన ఎంఐ టీవీ 4ఏ 40 సిరీస్​లో హారిజన్ (Mi TV 4A 40 Hotizon) మోడల్​ ప్రవేశపెట్టింది. ఈ మోడల్ త్వరలో భారత్​లో అమ్మకానికి రానుంది. మామూలు 4ఏ మోడల్ కంటే ఇది మరింత సన్నగా ఉండి లుక్స్ పరంగా అదుర్స్ అనిపించేలా ఉంది. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 93.7 శాతం స్క్రీన్​ టూ బాడీ రేషియోతో హై ఎండ్​ టీవీలను తలపించేలా ఉంది. వ్యూయింగ్​ యాంగిల్​ 178 డిగ్రీలుగా ఉంది. అలాగే రంగులు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిద్ పిక్చర్​ ఇండియన్​ (వీపీఈ)ని ఎంఐ జోడించింది.

భారత్​లో ఎంఐ టీవీ 4ఏ 40 హారిజన్ ధర


ఈ సరికొత్త టీవీ ధరను భారత్​లో రూ.23,999గా ఎంఐ నిర్ణయించింది. షావోమీ అధికారిక వెబ్​సైట్​, ఎంఐ హోమ్​, ఫ్లిప్​కార్ట్​తో పాటు రిటైల్ పార్ట్​నర్స్ స్టోర్స్​లో ఈ హారిజన్​ మోడల్​ను కొనుగోలు చేయవచ్చు. కాగా భారత్​లోని కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్ ఉండడంతో స్థానికంగా ఉన్న నిబంధలను దృష్టిలో ఉంచుకొని టీవీలను డెలివరీని చేయాలని ఎంఐ అనుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇది ముందే లభ్యం కావొచ్చు.

Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Amazon Prime Subscription: రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్... కండీషన్స్ అప్లై

ఎంఐ టీవీ 4ఏ 40 హారిజన్ స్పెసిఫికేషన్లు


ఎంఐ టీవీ 4ఏ 40 హారిజన్ ఎడిషన్​ 40 అంగుళాల ఫుల్​ హెచ్​డీ (1920x 1080) ఐపీఎస్ ప్యానెల్​తో 60హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్​తో వస్తోంది. కాగా ఈ ఎడిషన్​లో సాఫ్ట్​వేర్​ను షావోమీ కొంచెం మార్చింది. ఆండ్రాయిడ్​ 9.0తో మార్పులు చేసన పాచ్​వాల్​ను అందుబాటులోకి తెచ్చింది. డిస్నీ+ హాట్​స్టార్​, ప్రైమ్ వీడియో సహా 25 కంటెంట్ పార్ట్​నర్స్​ కంటెంట్​ను యూజర్లు చూడవచ్చు. అలాగే వేరే సపోర్టింగ్ యాప్స్​ను కూడా ఇన్​స్టాల్ చేసుకోవచ్చు. అలాగే కిడ్స్ మోడ్​, యూనివర్సల్ సెర్చ్​, స్మార్ట్ రెకమెండేషన్​, లైవ్ టీవీ స్పోర్ట్స్​, ఎంఐ హోమ్​తో పాటు ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి. అలాగే క్రోమ్​కాస్ట్ బుల్ట్​ఇన్​గా ఉంది. గూగుల్ అసిస్టెంట్​తో టీవీని కంట్రోల్​ చేయడంతో పాటు షావోమీ బ్రాండ్​ ఐఓటీ డివైజ్​లను కూడా వినియోగించుకోవచ్చు.

Realme X7 Max 5G: ఇండియాలో రిలీజ్ అయిన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ... ధర ఎంతంటే

Top 10 Smartphones: ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడుపోయిన 10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

ఈ హారిజన్ ఎడిషన్ టీవీలు ఎమ్లాజిక్ ప్రాసెసర్​తో పనిచేస్తాయి. దీంతో పాటు నాలుగు ఏఆర్​ఎం కోటెక్స్​-ఏ53 కోర్స్​, ఏఆర్​ఎం మాలి-450 ఎంపీ4 జీపీయూ, 1 జీబీ రామ్​, 8 జీబీ ఇంటర్నల్​ స్టోరేజీ ఈ మోడల్​లో ఉన్నాయి. అయితే వైఫై కనెక్షన్​ 802.11 బి/జి/ఎన్​కు పరిమితం చేయడం కాస్త నిరాశ కలిగించే అంశం. దీనివల్ల 5గిగా హర్జ్ వైఫైకు టీవీని కనెక్ట్ చేయలేము. 2.5 గిగా హర్జ్ వాడుకోవచ్చు. అయితే ఈ టీవీకి ఆర్​జే-45 ఎథర్​నెట్​ జాక్​ ఉండడంతో బ్రాడ్​బాండ్​ రూటర్​ను కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 10 వాట్స్​ స్టీరియో స్పీకర్లు ఈ హారిజన్ ఎడిషన్​లో ఉన్నాయి. అలాగే మూడు హెచ్​డీఎంఐ పోర్టులు, 3.5 ఎంఎం ఆడియో జాక్​, రెండు యూఎస్​బీ టైప్​-ఏ పోర్టులు ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published: