ఇండియన్ యూజర్ల కోసం మరో వ్యాలెట్ సర్వీస్ వచ్చేసింది. గూగుల్ పే, పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే'(మీ పే) రిలీజ్ చేసింది షావోమీ. ఇప్పటికే చైనాలో పాపులర్ అయిన 'ఎంఐ పే' పేమెంట్ సర్వీస్‌ను ఇండియాలో రిలీజ్ చేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తోంది షావోమీ. కొద్ది రోజుల క్రితం ఇండియాలో 'ఎంఐ పే' బీటా వర్షన్ రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు అధికారికంగా ఈ సర్వీస్‌ను లాంఛ్ చేసింది. గూగుల్ పే లాగా ఎంఐ పే కూడా యూపీఐ సర్వీస్. ఈ యాప్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతరుల బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు పంపొచ్చు. 120 బ్యాంకులను యాక్సెస్ చేయొచ్చు.
Whether it’s grocery shopping, transferring funds, online shopping or even bill payments, the #MiPay app does it all for you!
RT if you’ll be switching to the easy way to pay! Available soon on Mi Apps!#MiForYou pic.twitter.com/uM0KyCmJwA
— Mi India (@XiaomiIndia) March 19, 2019
భారతదేశంలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి డిజిటల్ వ్యాలెట్స్, ఇ-పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వాటికి పోటీగా 'ఎంఐ పే' తీసుకొచ్చింది షావోమీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) క్లియరెన్స్ రావడంతో 'ఎంఐ పే'ను లాంఛనంగా లాంఛ్ చేసింది. 'ఎంఐ పే' యాప్ షావోమీ ఇంటర్‌ఫేస్ ఎంఐయూఐలో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎంఐ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం మాత్రమే కాదు... బిల్లులు, రీఛార్జుల చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం 120 బిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ క్యూఆర్ కోడ్‌తో సహా ఇతర క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొచ్చు.
ఎంఐ పే యాప్ ఉపయోగించినవాళ్లు రెడ్‌మీ నోట్ 7, 32 అంగుళాల ఎంఐటీవీ 4ఏ ప్రో గెలుచుకునే అవకాశముందని షావోమీ ప్రకటించింది. ఇండియాలో 'ఎంఐ పే' యూపీఐ సర్వీస్ కోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది షావోమీ. యూజర్ల డేటాను ఇండియాలోనే స్టోర్ చేస్తామని షావోమీ ప్రకటించింది.
Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి 12 రోజులే గడువు... మార్చి 31 డెడ్‌లైన్
WhatsApp Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
PUBG vs Call of Duty: పబ్‌జీ లాంటి మరో గేమ్... ఆండ్రాయిడ్‌లో కాల్ ఆఫ్ డ్యూటీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON PAY, MI PAY, Paytm, UPI, Xiaomi