ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల మొబైళ్లు, ట్యాబ్లెట్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తుంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తుంది. షావోమీ తాజాగా చైనాలో నిర్వహించిన వర్చువల్ లాంచింగ్ ఈవెంట్లో ఎంఐ ప్యాడ్ 5, ఎంఐ ప్యాడ్ 5 ప్రో పేరుతో ట్యాబ్‌లను ఆవిష్కరించింది. దీంతో పాటు కంపెనీ ఎంఐ మాక్స్ 4 స్మార్ట్‌ఫోన్, Mi TV OLED సిరీస్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఇవి త్వరలోనే చైనా మార్కెట్లోకి రానున్నాయి. బడ్జెట్ ధరలోనే విడుదలైన ఈ ట్యాబ్లెట్లలో షావోమీ అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. ఎంఐ ప్యాడ్ 5 సిరీస్ డివైజ్‌లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ ట్యాబ్‌లు భారత్‌లోకి ఎప్పుడు వస్తాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
ఎంఐ ప్యాడ్ 5 ట్యాబ్లెట్ 11 అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10, ట్రూటోన్కు సపోర్ట్ ఇస్తుంది. ఇది డాల్బీ వైసన్ సపోర్ట్ గల ఈ ట్యాబ్లెట్MIUIతో పనిచేస్తుంది. ఇది హై-రిజల్యూషన్ ఆడియో, డాల్బీ అట్మోస్‌కు మద్దతిస్తుంది. దీనిలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 87WmAh బ్యాటరీని అందించారు. దీని వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను చేర్చింది.
ఎంఐ ప్యాడ్ 5 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 11-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10, ట్రూటోన్తో పాటు డాల్బీ విజన్‌కు మద్దతిస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాలను చేర్చింది. ఎంఐ ప్యాడ్ 5 ప్రో 8600 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.