• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI LAUNCHES MI NOTEBOOK PRO 15 AND MI NOTEBOOK PRO 14 LAPTOPS KNOW SPECIFICATIONS SS GH

Mi Notebook Pro: ఎంఐ నోట్​బుక్​ ప్రో సిరీస్​లో మరో రెండు ల్యాప్​ట్యాప్స్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Mi Notebook Pro: ఎంఐ నోట్​బుక్​ ప్రో సిరీస్​లో మరో రెండు ల్యాప్​ట్యాప్స్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Mi Notebook Pro: ఎంఐ నోట్​బుక్​ ప్రో సిరీస్​లో మరో రెండు ల్యాప్​ట్యాప్స్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Mi Notebook Pro | ఎంఐ నోట్ బుక్ ప్రో 15, ఎంఐ నోట్ బుక్ ప్రో 14 ల్యాప్‌టాప్స్‌ని లాంఛ్ చేసింది షావోమీ. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
చైనా టెక్​ దిగ్గజం షావోమీ స్మార్ట్​ఫోన్​లోనే కాదు ల్యాప్​ట్యాప్​, స్మార్ట్​టీవీ మార్కెట్​లో కూడా మంచి మార్కెట్​ను సొంతం చేసుకుంది. బడ్జెట్​ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంతో షావోమీ ఉత్పత్తులకు భారీ డిమాండ్​ ఏర్పడింది. తాజాగా షావోమీ తన ఎంఐ నోట్‌బుక్ సిరీస్​లో రెండు కొత్త ల్యాప్​టాప్​లను విడుదల చేసింది. ఎంఐ ప్రో 15, ఎంఐ నోట్‌బుక్ ప్రో 14 అనే రెండు ల్యాప్‌టాప్ మోడళ్లను చైనాలో విడుదల చేసింది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లలో అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఈ రెండిట్లోనూ 11వ జనరేషన్​ ఇంటెల్ టైగర్ లేక్ పీపీయూ ప్రాసెసర్​ను, ఎన్విడియా జిఫోర్స్ గ్రాఫిక్​ కార్డు, థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లను అందించారు. ఒక్క డిస్​ప్లే మినహా మిగతా అన్ని ఫీచర్లను ఈ రెండింట్లో దాదాపు ఒకే రకంగా అందించడం విశేషం. ఎంఐ నోట్​బుక్​ ప్రో 15 ఓఎల్ఈడి డిస్​ప్లేతో వస్తుండగా, ఎంఐ నోట్​బుక్ ప్రో 14 హై రిఫ్రెష్ రేట్ ఎల్​సీడి డిస్​ప్లేతో వస్తుంది. ఈ రెండూ మల్టిపుల్​ కాన్ఫిగరేషన్లలో, ఒకే కలర్​ ఆప్షన్​తో అందుబాటులో ఉంటాయి.

Samsung Galaxy F12: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, ఎఫ్02ఎస్ రిలీజ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

Jio Cricket plans: ఐపీఎల్ స్పెషల్... జియో అందిస్తున్న క్రికెట్ ప్లాన్స్ ఇవే

ధర, లభ్యత


ఎంఐ నోట్‌బుక్ ప్రో 15 ధర చైనాలో CNY 6,499 (భారత కరెన్సీలో సుమారు రూ. 72,900) వద్ద ప్రారంభమవుతుంది. ఇది మీకు 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ గ్రాఫిక్‌లతో కూడిన కోర్ ఐ 5 సీపీయూ ఆప్షన్లతో లభిస్తుంది. ఇక, డెడికేటెడ్​ ఎన్విడియా జిఫోర్స్ MX450 GPU గ్రాఫిక్​ కార్డుతో కూడిన వేరియంట్​ మాత్రం CNY 6,999 (భారత కరెన్సీలో సుమారు రూ.78,500)లకు లభిస్తుంది. డెడికేటెడ్​ GPU కాన్ఫిగరేషన్‌ను కోర్ i7 కు అప్‌గ్రేడ్ చేసిన వేరియంట్​ CNY 7,999 (సుమారు రూ .90,000)కు లభిస్తుంది. ఎంఐ నోట్​బుక్​ ప్రో 15 మాదిరిగానే ప్రో 14 కూడా మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. దీని బేస్ వేరియంట్ ధర CNY 5,299 (సుమారు రూ. 59,400) వద్ద ప్రారంభమవుతుంది. ఎన్విడియా జీఫోర్స్​ గ్రాఫిక్​ కార్డుతో కూడిన వేరియంట్​కు CNY 5,999 (సుమారు రూ. 67,300) ఖర్చు అవుతుంది. ఇక, టాప్-టైర్ వేరియంట్ CNY 6,999 (సుమారు రూ.78,500)లకు లభిస్తుంది. కాగా, ఎంఐ నోట్‌బుక్ ప్రో 15, ప్రో 14 రెండూ సిల్వర్ కలర్‌ ఆప్షన్​లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెండు మోడళ్లు ఎంఐ చైనా వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయని షావోమీ పేర్కొంది. ఎంఐ నోట్‌బుక్ ప్రో 15 డెలివరీలు ప్రారంభం కాగా, ప్రో 14 మాత్రం మే 1 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్​లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై మాత్రం షావోమీ ఎటువంటి స్పష్టతనివ్వలేదు.

Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.10,999 ధరకే సొంతం చేసుకోండి... ఈ ఆఫర్ వారికి మాత్రమే

POCO X3 Price Cut: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది

ఒకే రకమైన స్పెసిఫికేషన్లు


ఈ రెండు ల్యాప్‌టాప్ మోడళ్లలో దాదాపు ఒకే రకమైన ఫీచర్లను అందించారు. ఎంఐ నోట్‌బుక్ ప్రో 15లో 15.6 -అంగుళాల OLED డిస్​ప్లేను చేర్చారు. ఇది 3,456x2,160 పిక్సెల్స్ రిజల్యూషన్, 16:10 కారక నిష్పత్తి, 261 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 60Hz రిఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. ఇక, ఎంఐ నోట్​బుక్ ప్రో 14లో మాత్రం 14 -అంగుళాల 2 కె (2,560x1,600 పిక్సెల్స్) డిస్​ప్లేను అందించారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 88 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 16:10 కారక నిష్పత్తి, 216 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 300 నిట్స్ బ్రైట్​నెస్​ కలిగి ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం పరంగా చూస్తే.. ఎంఐ నోట్‌బుక్ ప్రో 15లో 66 వీఆర్ బ్యాటరీని అమర్చారు. ఇది ఫాస్ట్​ ఛార్జింగ్‌కు సపోర్ట్​ ఇస్తుంది. దీని సహాయంతో కేవలం 35 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇక, ఎంఐ నోట్‌బుక్ ప్రో 14లో మాత్రం 56 వీఆర్ బ్యాటరీని అందించారు. దీని సహాయంతో కేవలం 37 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఎంఐ నోట్​బుక్​ ప్రో 15 మోడల్​ 1.8 కిలోల బరువు ఉండగా, ప్రో 14 మాత్రం1.5 కిలోల బరువును కలిగి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు