Xiaomi Mi Box 4K: టీవీని స్మార్ట్ టీవీగా మార్చే 'ఎంఐ బాక్స్ 4కే' రిలీజ్... ఫీచర్స్ ఇవే

Xiaomi Mi Box 4K | ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ప్రొడక్ట్‌ని లాంఛ్ చేసింది షావోమీ. సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చే ఎంఐ బాక్స్ 4కే రిలీజైంది.

news18-telugu
Updated: May 8, 2020, 2:41 PM IST
Xiaomi Mi Box 4K: టీవీని స్మార్ట్ టీవీగా మార్చే 'ఎంఐ బాక్స్ 4కే' రిలీజ్... ఫీచర్స్ ఇవే
Xiaomi Mi Box 4K: టీవీని స్మార్ట్ టీవీగా మార్చే 'ఎంఐ బాక్స్ 4కే' రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Xiaomi India)
  • Share this:
మీ దగ్గర ఎల్ఐడీ టీవీ ఉందా? ఆ టీవీ తీసేసి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చే డివైజ్‌లు చాలానే ఉన్నాయి. వాటితో మీ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేయొచ్చు. అలాంటి డివైజ్‌ను 'ఎంఐ బాక్స్ 4కే' పేరుతో రిలీజ్ చేసింది షావోమీ. ఆండ్రాయిడ్ టీవీ 9 పై సపోర్ట్‌తో 'ఎంఐ బాక్స్ 4కే' పనిచేస్తుంది. టీవీకి ఉన్న హెచ్‌డీఎంఐ పోర్టుతో కనెక్ట్ చేస్తే చాలు. వైఫై కనెక్టివిటీ ఉండాలి. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్తీ+ హాట్‌స్టార్ లాంటి యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయి. 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ, స్టాక్ ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్‌ఫేస్‌తో 'ఎంఐ బాక్స్ 4కే' పనిచేస్తుంది. యూఎస్‌బీ పోర్ట్, హెడ్‌ఫోన్స్ లేదా వైర్‌లెస్ స్పీకర్స్ కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి.


మే 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి mi.com, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోమ్ స్టోర్, ఎంఐ స్టూడియో స్టోర్స్‌లో 'ఎంఐ బాక్స్ 4కే' లభిస్తుంది. త్వరలో షావోమీ పార్ట్‌నర్ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా 'ఎంఐ బాక్స్ 4కే' కొనొచ్చు. 'ఎంఐ బాక్స్ 4కే' ధర రూ.3,499. ఈ బాక్స్ కొనేవారికి డాక్యుబే, ఎపిక్, హోయ్‌ఛోయ్, షెమారూ నుంచి ఆఫర్స్ లభిస్తాయి.

ఇవి కూడా చదవండి:

Xiaomi Mi 10: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రిలీజ్ అయిన షావోమీ ఎంఐ 10

Jio Prepaid Plan: ఈ జియో ప్లాన్ రీఛార్జ్ చేస్తే 102 జీబీ డేటా వాడుకోవచ్చు

Samsung: టీవీ కొంటే 15% క్యాష్‌బ్యాక్... సాంసంగ్ ఆఫర్
Published by: Santhosh Kumar S
First published: May 8, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading