Xiaomi: ట్రిమ్మర్ లాంఛ్ చేసిన షావోమీ... ధర ఎంతో తెలుసా?

Mi Beard Trimmer 1C | ట్రిమ్మర్ కొనాలనుకుంటున్నారా? షావోమీ ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 6, 2020, 6:48 PM IST
Xiaomi: ట్రిమ్మర్ లాంఛ్ చేసిన షావోమీ... ధర ఎంతో తెలుసా?
Xiaomi: ట్రిమ్మర్ లాంఛ్ చేసిన షావోమీ... ధర ఎంతో తెలుసా?
  • Share this:
షావోమీ నుంచి స్మార్ట్ ట్రిమ్మర్ వచ్చేసింది. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ పేరుతో సరికొత్త ట్రిమ్మర్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. ఈ ట్రిమ్మర్ ధర రూ.999. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ బాక్సులో ట్రావెల్ పౌచ్, ఛార్జింగ్ కేబుల్, ట్రిమ్మింగ్ కోంబ్, క్లీనింగ్ బ్రషన్ లాంటివి ఉంటాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 60 నిమిషాలు వాడుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ స్టేటస్ తెలుసుకోవడానికి ఎల్ఈడీ లైట్ ఉంటుంది. రకరకాల స్టైల్స్‌ కోసం ఈ ట్రిమ్మర్‌లో 20 లెంత్ సెట్టింగ్స్, 0.5 ప్రిసిషన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్‌సైట్స్‌లో సేల్ మొదలైంది.


షావోమీ పేరు చెబితే గతంలో స్మార్ట్‌ఫోన్లు మాత్రమే గుర్తొచ్చేవి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ అనేక సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత పవర్ బ్యాంక్స్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్‌, ల్యాప్‌టాప్, స్పోర్ట్స్ వేర్, స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్స్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ హెడ్ సెట్స్ లాంటి అనేక ప్రొడక్ట్స్‌ని లాంఛ్ చేసింది. గతంలో ఓ ట్రిమ్మర్‌ని లాంఛ్ చేసిన షావోమీ... ఇప్పుడు ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీని పరిచయం చేసింది.
Published by: Santhosh Kumar S
First published: August 6, 2020, 6:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading