ఇండియాలో క్యూలెడ్ అల్ట్రా హెచ్డీ స్క్రీన్‌తో 55 అంగుళాల స్మార్ట్‌టీవీని లాంఛ్ చేసింది షావోమీ. ఎంఐ క్యూలెడ్ టీవీ 4కే మోడల్‌ను పరిచయం చేసింది. ఈ టీవీ ధర రూ.54,999. ఇది ఆండ్రాయిడ్ టీవీ. ప్యాచ్ వాల్ సపోర్ట్ ఉండటం విశేషం. షావోమీ ఇండియాలో రిలీజ్ చేసిన మొదటి క్యూలెడ్ టీవీ ఇది. ఇప్పటికే వన్‌ప్లస్, టీసీఎల్ లాంటి బ్రాండ్స్ ఇండియాలో క్యూలెడ్ టీవీలను పరిచయం చేశాయి. వాటి ధరలు కూడా రూ.60,000 రేంజ్‌లోనే ఉన్నాయి. OnePlus TV Q1, TCL 55C715 లాంటి టీవీలకు Mi QLED TV 4K గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. షావోమీ నుంచి ఖరీదైన టీవీ కూడా ఇదే. ఎంఐ క్యూలెడ్ టీవీ 4కే ధర రూ.54,999. ఇప్పటివరకు ఎల్ఈడీ టీవీలు మాత్రమే లాంఛ్ చేసింది. ఇప్పుడు ఇండియాలో మొదటిసారిగా క్యూలెడ్ టీవీని పరిచయం చేసింది. ఎంఐ క్యూలెడ్ టీవీ 4కే సేల్ డిసెంబర్ 21 మధ్యాహ్నం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్‌సైట్స్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఇతర రీటైల్ స్టోర్లలో ప్రారంభం అవుతుంది.
ఎంఐ క్యూలెడ్ టీవీ 4కే ప్రత్యేకతలు చూస్తే ఇది 55 అంగుళాల అల్ట్రా హెచ్డీ టీవీ. రెజల్యూషన్ 3840x2160 పిక్సెల్స్. ప్రస్తుతం కేవలం 55 అంగుళాల సైజ్‌లో మాత్రమే రిలీజైంది. హెచ్డీఆర్ ఫార్మాట్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్‌గా వస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ టీవీ లాంఛర్తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ MT9611 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ర్యామ్ 2జీబీ కాగా ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ. 6 స్పీకర్స్ 30వాట్ సౌండ్ ఔట్పుట్ ఇస్తాయి. 3 హెచ్డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. రిఫ్రెష్ రేట్ 60Hz. ఇక ఎంఐ టీవీ మోడల్స్‌కి ఉన్నట్టే ఎంఐ క్యూలెడ్ టీవీ 4కే రిమోట్లో కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ అసిస్టెంట్ బటన్స్ ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.