క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్... షావోమీ నుంచి కొత్త పవర్ బ్యాంక్

Mi Power Bank - World Cup Edition | బ్లాక్, రెడ్, వైట్ పవర్ బ్యాంక్ ధర రూ.899 కాగా వరల్డ్ కప్ ఎడిషన్ బ్లూ కలర్ పవర్ బ్యాంక్ ధర రూ.999.

news18-telugu
Updated: June 5, 2019, 3:31 PM IST
క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్... షావోమీ నుంచి కొత్త పవర్ బ్యాంక్
క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్... షావోమీ నుంచి కొత్త పవర్ బ్యాంక్ (image: Xiaomi)
news18-telugu
Updated: June 5, 2019, 3:31 PM IST
క్రికెట్ లవర్స్‌కు, షావోమీ ఫ్యాన్స్‌కు కామన్‌గా గుడ్ న్యూస్. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 సందర్భంగా షావోమీ "ఎంఐ పవర్ బ్యాంక్-వరల్డ్ కప్ ఎడిషన్" రిలీజ్ చేసింది. ఇప్పటికే ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే బ్లాక్, రెడ్, వైట్ కలర్స్‌లో మాత్రమే లభిస్తుంది. క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ మొదలవడంతో ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ కలర్ బ్లూతో వరల్డ్ కప్ ఎడిషన్ పవర్ బ్యాంక్ రిలీజ్ చేసింది షావోమీ. బ్లాక్, రెడ్, వైట్ పవర్ బ్యాంక్ ధర రూ.899 కాగా వరల్డ్ కప్ ఎడిషన్ బ్లూ కలర్ పవర్ బ్యాంక్ ధర రూ.999. అంటే వరల్డ్ కప్ ఎడిషన్ పవర్ బ్యాంక్ కోసం అదనంగా రూ.100 ఖర్చు చేయాల్సిందే.


వరల్డ్ కప్ ఎడిషన్ ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ కెపాసిటీ 10,000 ఎంఏహెచ్. ఔట్‌పుట్ కెపాసిటీ 6500 ఎంఏహెచ్ వరకు లభిస్తుంది. లిథియం పాలిమర్ బ్యాటరీస్‌తో తయారు చేసిన పవర్ బ్యాంక్ ఇది. డ్యూయెల్ యూఎస్‌బీ ఔట్‌పుట్, టూ-వే క్విక్ ఛార్జ్. 9 లేయర్ సర్క్యుట్ చిప్ ప్రొటెక్షన్, ఎల్ఈడీ ఇండికేటర్ లాంటి ఫీచర్లున్నాయి. బరువు 240 గ్రాములు ఉంటుంది. ఈ పవర్ బ్యాంకుపై 6 నెలల వారెంటీ లభిస్తుంది.Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి
Loading...

ఇవి కూడా చదవండి:

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

ఆన్‌లైన్‌లో చెప్పులు కొంటున్నారా? ఈ 11 జాగ్రత్తలు తప్పనిసరి

పాత ఫోన్ అమ్మేస్తున్నారా? తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలివే
First published: June 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...