Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలు ఇవే

Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలు ఇవే (image: Xiaomi India)

Redmi Note 10S | కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? షావోమీ నుంచి రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ప్రత్యేకతలు తెలుసుకోండి.

  • Share this:
    షావోమీ ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్‌ను రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో నాలుగో స్మార్ట్‌ఫోన్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది షావోమీ. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్‌లో రెడ్‌మీ నోట్ 10ఎస్ రిలీజ్ అయింది. మే 18న అమెజాన్, షావోమీ వెబ్‌సైట్లలో సేల్ మొదలవుతుంది. షావోమీ స్టోర్లలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

    Mi 11x Pro: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే

    Moto G40 Fusion: మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్


    రెడ్‌మీ నోట్ 10ఎస్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ95
    రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్
    ధర:
    6జీబీ+64జీబీ- రూ.14,999
    6జీబీ+128జీబీ- రూ.15,999

    Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

    Realme 8 5G: మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తే రూ.549 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్


    రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెడ్‌మీ వాచ్‌ను కూడా రిలీజ్ చేసింది షావోమీ. 1.4 అంగుళాల డిస్‌ప్లే, 2.5డీ టెంపర్డ్ గ్లాస్, బ్లూటూత్ 5.0 సపోర్ట్, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ వాచ్‌లో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, సిక్స్ యాక్సిస్ సెన్సార్, జియోమ్యాగ్నెటిక్ సెన్సార్, యాంబియెంట్ లైట్ సెన్సార్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. హార్ట్ రేట్ 30 రోజుల రికార్డ్ ఉంటుంది. ఇక ఇందులో ట్రెడ్‌మిల్, ఔట్‌డోర్ రన్నింగ్, ఇండోర్ అండ్ ఔట్‌డోర్ సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ఏడు రకాల స్పోర్ట్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో 230ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే 7 రోజులు వాడుకోవచ్చు. 120 వాచ్ ఫేస్ ఆప్షన్స్ ఉన్నాయి. రెడ్‌మీ వాచ్ ధర రూ.3,999. మే 25న సేల్ మొదలవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: