XIAOMI LAUNCHED MI TV 4X MI TV 4A MI SMART BAND 4 MI SMART WATER PURIFIER AND MI MOTION ACTIVATED NIGHT LIGHT 2 IN INDIA SS
Xiaomi: స్మార్ట్‌టీవీ, వాటర్ ప్యూరిఫైర్... షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్
Xiaomi: స్మార్ట్‌టీవీ, వాటర్ ప్యూరిఫైర్... షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్
(image: @manukumarjain/twitter)
Xiaomi Smarter Living 2020 | దసరా సేల్ సందర్భంగా సెప్టెంబర్ 29న ఎంఐ టీవీల సేల్ మొదలవుతుంది. స్మార్ట్ టీవీతో పాటు వాటర్ ప్యూరిఫైర్, ఎంఐ స్మార్ట్‌బ్యాండ్ 4, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 రిలీజ్ చేసింది షావోమీ.
దసరా, దీపావళి పండుగ సమయంలో కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్మార్ట్‌ఫోన్‌తో పాటు టీవీ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమీ... సరికొత్త టీవీని లాంఛ్ చేసింది. మూడు ఎంఐ టీవీ 4ఎక్స్, ఒక ఎంఐ టీవీ 4ఏ మోడల్స్‌ని ఇండియాకు పరిచయం చేసింది. ఏకంగా నాలుగు సైజుల్లో టీవీని లాంఛ్ చేసింది షావోమీ. ఈ నాలుగూ స్మార్ట్టీవీలే. ఎంఐ టీవీ 4ఎక్స్ టీవీలు అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ 9.0, ప్యాచ్‌వాల్ 2.0 ఇంటర్ఫేస్తో పనిచేస్తాయి ఈ స్మార్ట్ టీవీలు. డేటాసేవర్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ టీవీల్లో ఉన్నాయి. దసరా సేల్ సందర్భంగా సెప్టెంబర్ 29న ఎంఐ టీవీల సేల్ మొదలవుతుంది. స్మార్ట్ టీవీతో పాటు వాటర్ ప్యూరిఫైర్, ఎంఐ స్మార్ట్‌బ్యాండ్ 4, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 రిలీజ్ చేసింది షావోమీ. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైర్ సేల్ సెప్టెంబర్ 29న ప్రారంభమౌతుంది.
Xiaomi: షావోమీ రిలీజ్ చేసిన స్మార్ట్ ప్రొడక్ట్స్ ఇవే...
ఎంఐ టీవీ 4ఏ (40 అంగుళాలు)- రూ.17,999
ఎంఐ టీవీ 4ఎక్స్ (43 అంగుళాలు)- రూ.24,999
ఎంఐ టీవీ 4ఎక్స్ (50 అంగుళాలు)- రూ.29,999
ఎంఐ టీవీ 4ఎక్స్ (65 అంగుళాలు)- రూ.54,999
ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైర్- రూ.11,999
ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4- రూ.2,299
ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2- రూ.500
Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.