Mi Power Bank 3: షావోమీ మరో సంచలనం... రూ.2,000 లోపే 30,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్

Xiaomi Mi Power Bank 3 | షావోమీ నుంచి మరో పవర్ వచ్చేసింది. ఈసారి భారీ కెపాసిటీతో ఎంఐ పవర్ బ్యాంక్ 3 రిలీజ్ చేసింది షావోమీ.

news18-telugu
Updated: June 17, 2020, 6:23 PM IST
Mi Power Bank 3: షావోమీ మరో సంచలనం... రూ.2,000 లోపే 30,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్
Mi Power Bank 3: షావోమీ మరో సంచలనం... రూ.2,000 లోపే 30,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ (image: Xiaomi)
  • Share this:
షావోమీ మరో సంచలనం సృష్టించింది. రూ.2,000 లోపే 30,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ రిలీజ్ చేసింది. షావోమీ నుంచి వచ్చిన అతిపెద్ద పవర్ బ్యాంక్ ఇది. ఇప్పటికే 20,000ఎంఏహెచ్ కెపాసిటీతో ఎంఐ పవర్ బ్యాంక్ 2 ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 30,000ఎంఏహెచ్ భారీ కెపాసిటీతో ఎంఐ పవర్ బ్యాంక్ 3 రిలీజ్ చేసింది. షావోమీ 30 వాట్ ఛార్జర్‌తో ఈ పవర్ బ్యాంకును ఫుల్ ఛార్జ్ చేయడానికి 7.5 గంటలు పడుతుంది. ఈ పవర్ బ్యాంకుతో ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ కెపాసిటీతో ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్‌ఫోన్‌ను 10.5 సార్లు, ఎంఐ 10, రెడ్‌మీ కే30 ప్రో ఫోన్లను 4.5 సార్లు ఛార్జ్ చేస్తుంది. యూఎస్‌బీ సీ ద్వారా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫిట్‌నెస్ బ్యాండ్స్, బ్లూటూత్ హెడ్‌సెట్స్ లాంటి చిన్న డివైజ్‌లను ఛార్జ్ చేసేందుకు స్పెషల్ మోడ్ కూడా ఉంది. ఈ పవర్ బ్యాంకు ధర చైనాలో 169 యువాన్లు. ఇండియాలో ధర సుమారు రూ.1,800 ఉంటుంది. బ్లాక్, వైట్ కలర్స్‌లో ఈ ఎంఐ పవర్ బ్యాంక్ 3 రిలీజ్ చేసింది షావోమీ. చైనాలో జూన్ 18న సేల్ ప్రారంభం కానుంది. ఇక భారీ కెపాసిటీతో చైనాలో రిలీజ్ అయిన ఎంఐ పవర్ బ్యాంక్ 3 ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి:

Tecno spark power 2: పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ... రూ.9,999 ధరకే అదిరిపోయే ఫీచర్స్

రూ.9,999 ధరకే కంప్యూటర్... వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మంచి ఆఫర్

Samsung Galaxy A21s: ఇండియాలో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్... ధర ఎంతంటే
Published by: Santhosh Kumar S
First published: June 17, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading