XIAOMI : జియోమి నుంచి త్వరలోనే 100MP స్మార్ట్ ఫోన్..

XIAOMI : ఈ రెండు ఫోన్లు మార్కెట్‌లోకి వస్తే.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయని భావిస్తున్నారు. జియోమి తీసుకురాబోతున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో సాంసంగ్ సెన్సార్లను వాడనున్నారు.

news18-telugu
Updated: August 7, 2019, 8:39 PM IST
XIAOMI : జియోమి నుంచి త్వరలోనే 100MP స్మార్ట్ ఫోన్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 7, 2019, 8:39 PM IST
ఇండియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న జియోమి బ్రాండ్.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను ప్రకటించింది. 64MP(మెగా పిక్సెల్) కలిగిన స్మార్ట్ ఫోన్‌ను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురాబోతోన్నట్టు తెలిపింది. అంతేకాదు త్వరలోనే 100MP స్మార్ట్‌ ఫోన్‌ను కూడా లాంచ్ చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ రెండు ఫోన్లు మార్కెట్‌లోకి వస్తే.. కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయని భావిస్తున్నారు. జియోమి తీసుకురాబోతున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో సాంసంగ్ సెన్సార్లను వాడనున్నారు. జియోమి 64MP స్మార్ట్‌‌ఫోన్‌లో సాంసంగ్ GW1 64MP సెన్సార్, 100MP స్మార్ట్‌ ఫోన్‌లో 108-మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL సెన్సార్ వాడనున్నారు. జియోమి 64MP స్మార్ట్‌ఫోన్‌లో స్మార్ట్ ISO ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. బ్రైట్ ఎన్విరాన్‌మెంట్‌లో తక్కువ ISO,డార్క్ ఎన్విరాన్‌మెంట్‌లో ఎక్కువ ISO ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి. ISOCELL సెన్సార్ టెక్నాలజీతో ఇందులో కలర్ రీప్రొడక్షన్‌ మరింత రిచ్‌గా ఉంటుంది. ఇందులోని 64MP కెమెరా 9248 x 6936 పిక్సెల్ రిసల్యూషన్‌తో పనిచేస్తుంది. ఇందులో ఉండే రియల్ టైమ్ హార్డ్‌వేర్ 100db హై డైనమిక్ రేంజ్‌ సపోర్ట్‌తో ఫోటోలు మరింత రిచ్‌గా కనిపిస్తాయి.64MP స్మార్ట్‌ఫోన్ వివరాలు వెల్లడించిన జియోమి 100MP స్మార్ట్‌ఫోన్ గురించి మాత్రం ఇంకా వివరాలు వెల్లడించలేదు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...