భారతీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. షియోమి తాజాగా తన రెడ్మీ నోట్ 9 మోడల్‌ను MIUI 12.5 లేటెస్ట్ వెర్షన్‌తో అప్డేట్ చేసింది. పర్ఫార్మెన్స్, సౌండ్, ఫీచర్ల విషయంలో ఎన్నో కొత్త అప్డేట్లను చేర్చింది.
షియోమి నుంచి ఇటీవల లాంచ్ అవుతున్న అన్ని ఫోన్లలో MIUI 12.5 వెర్షన్‌నే అందిస్తోంది. ఇప్పుడు ఇదే వెర్షన్‌ను తన పాత స్మార్ట్ఫోన్లలో సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా రన్ అవుతుంది. కెమెరా, సౌండ్, లుక్ ఇలా అన్ని విషయాల్లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే షియోమి రెడ్మీ నోట్ 9లో MIUI 12.5 ఎన్హాన్సుడ్ అప్డేట్ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
షియోమి ఈ ఆగస్టు నుంచి తన స్మార్ట్ఫోన్లలో లేటెస్ట్ అప్డేట్లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రెడ్మీ నోట్ 9లో లేటెస్ట్ అప్డేట్ను తీసుకువచ్చింది. ఫలితంగా రెడ్మీ నోట్ 9 యూజర్లు వారి మొబైల్లో లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకునే అవకాశం లభించింది.
రెడ్మీ నోట్ 9 భారత మార్కెట్లోకి లాంచ్ అయిన సమయంలో ఆండ్రాయిడ్ 10, MIUI 11 సపోర్ట్‌తో వచ్చింది. ఆ తర్వాత కొత్త OTA (ఓవర్- ది- ఎయిర్) అప్డేట్ను అందించింది. అయితే ఈ అప్డేట్ను చాలా కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.
20 రెట్లు వేగంగా పనితీరు..
ఈ సరికొత్త అపడేట్‌ను ఆప్టిమైజేషన్ ప్యాకేజీగా టెలికాం టాక్ నివేదిక పేర్కొంది. ఈ అప్డేట్ కారణంగా ఇంటర్ఫేస్ మొత్తం స్వరూపమే మారిపోతుందని నివేదిక తెలిపింది. అంతేకాదు, ఈ తాజా MIUI 12.5 ఎడిషన్ అప్డేట్లో 2021అక్టోబర్‌లో వచ్చిన లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను చేర్చింది. MIUI 12.5 అనేది దాని ముందున్న దానితో పోలిస్తే దాదాపు 20 రెట్లు మెరుగైన కంప్యూటింగ్ పవర్‌తో కూడిన ఇంటర్ఫేస్. ఈ అప్డేట్ గల స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సేపు వాడినా సరే తక్కువ బ్యాటరీని ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అంతేకాదు, అనేక సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Redmi, Smartphones, Xiaomi