• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI INDIA TO LAUNCH MI 11 SERIES SMARTPHONES ON APRIL 23 IN INDIA KNOW SPECIFICATIONS AND EXPECTED PRICE SS

Mi 11 Ultra: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఎంఐ 11 అల్ట్రా... ఏప్రిల్ 23న రిలీజ్

Mi 11 Ultra: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఎంఐ 11 అల్ట్రా... ఏప్రిల్ 23న రిలీజ్

Mi 11 Ultra: ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఎంఐ 11 అల్ట్రా... ఏప్రిల్ 23న రిలీజ్ (image: Xiaomi)

Mi 11 Ultra | షావోమీ ఇండియా ఎంఐ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేయనుంది. ఏప్రిల్ 23న ఈ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

  • Share this:
    షావోమీ మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేయనుంది. ఎంఐ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఇండియాకు పరిచయం చేయనుంది. చైనాలో రిలీజ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్లు పలు రికార్డుల్ని సృష్టించాయి. తొలి సేల్‌లోనే రూ.1,340 కోట్ల విలువైన ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి. చైనాలో ఒకేసారి ఎంఐ 11 అల్‌ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంఐ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు షావోమీ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 23న ఎంఐ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ కానున్నాయి. అయితే ఎన్ని స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతాయో తెలియదు. ఎంఐ 11 సిరీస్‌లో మొత్తం 5 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఎంఐ 11, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11ఐ, ఎంఐ 11 లైట్ 5జీ మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఎంఐ 11, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్‌ట్రా, ఎంఐ 11ఐ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. ఎంఐ 11 లైట్ 5జీలో మాత్రం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 780 ప్రాసెసర్ మాత్రమే ఉంది. అయితే వీటిలో ఏప్రిల్ 23న ఎంఐ 11 అల్ట్రా మాత్రమే ఇండియాలో లాంఛ్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.

    Smartphones under Rs 10000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Tata Sky: టాటా స్కై వాడుతున్నారా? ఈ ప్రోమో కోడ్‌తో డిస్కౌంట్ పొందండి


    ఎంఐ 11 అల్‌ట్రా స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.81 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 48 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలీఫోటో సెన్సార్ + 48 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ధరల వివరాలు చూస్తే 8జీబీ+256జీబీ వేరియంట్ ధర సుమారు రూ.67,000 ఉండొచ్చని అంచనా. ఇక 12జీబీ+256జీబీ ధర సుమారు రూ.72,600, హైఎండ్ వేరియంట్ 12జీబీ+512జీబీ ధర సుమారు రూ.1,03,400 ఉండొచ్చని అంచనా.

    OPPO F19: మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.1,990 ధరకే కొనొచ్చు

    AC Buying Guide: ఏసీ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి


    ఎంఐ 11 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.81 అంగుళాల 2K WQHD+ E4 అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇందులో కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ టెలీ మ్యాక్రో టెర్టియర్ సెన్సార్ రియర్‌కెమెరా సెటప్ ఉండగా ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో ధరల వివరాలు చూస్తే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర సుమారు రూ.55,400 ఉండొచ్చని అంచనా. ఇక 8జీబీ+256జీబీ వేరియంట్ ధర సుమారు రూ.58,700, హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర సుమారు రూ.63,100 ఉండొచ్చని అంచనా.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు