Home /News /technology /

Mi 10T: ఇండియాలో ఎంఐ 10టీ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Mi 10T: ఇండియాలో ఎంఐ 10టీ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Mi 10T: ఇండియాలో ఎంఐ 10టీ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే
(image: Xiaomi India)

Mi 10T: ఇండియాలో ఎంఐ 10టీ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే (image: Xiaomi India)

Xiaomi Mi 10T 5G and Xiaomi Mi 10T Pro 5G | షావోమీ ఇండియా నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కాబోతున్నాయి. ఈసారి ఎంఐ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేయనుంది షావోమీ.

    చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ ఇండియాలో ఎంఐ, రెడ్‌మీ, పోకో బ్రాండ్లతో స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా రెడ్‌మీ ఫోన్లే ఇండియాలో రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల పోకో బ్రాండ్ నుంచి కొత్త ఫోన్లు వస్తున్నాయి. ఎంఐ ఫోన్లు తక్కువ. ఈసారి ఎంఐ ఫోన్లు రిలీజ్ చేయనుంది షావోమీ. ఇండియాలో ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించింది. చాలాకాలంగా షావోమీ ఫ్యాన్స్ ఎంఐ 10టీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఇండియాకు తీసుకురావాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు వీటిని ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు షావోమీ ఇండియా ట్విట్టర్‌లో ప్రకటించింది. అక్టోబర్ 15న ఈ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వీటి సేల్ మొదలయ్యే అవకాశముంది. ఇప్పటికే ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో, ఎంఐ 10టీ లైట్ స్మార్ట్‌ఫోన్లు ఇతర దేశాల్లో రిలీజ్ అయ్యాయి. కాబట్టి వీటి స్పెసిఫికేషన్స్ అందరికీ తెలిసినవే. ఇండియన్ వేరియంట్‌లో ఏవైనా మార్పులు ఉంటే ఉండొచ్చు. ఇండియాలో ఎంఐ 10టీ లైట్ స్మార్ట్‌ఫోన్‌ను షావోమీ రిలీజ్ చేయట్లేదు. ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో మోడల్స్ మాత్రమే రిలీజ్ కానున్నాయి. వీటి ప్రత్యేకతలు చూస్తే ఇవి 5జీ స్మార్ట్‌ఫోన్లు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

    Flipkart Big Billion Days: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

    Flipkart Sale: రూ.70,000 స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లో రూ.20,000 మాత్రమే... ఇలాంటి బంపరాఫర్ మళ్లీ రాకపోవచ్చు


    ఎంఐ 10టీ ప్రో 5జీ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్)
    ర్యామ్: 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865
    రియర్ కెమెరా: 108+13+5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్
    ధర: సుమారు రూ.51,000

    Android Apps: అలర్ట్... ఈ 34 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్... వెంటనే డిలిట్ చేయండి

    Smartphones: మేడ్ ఇన్ చైనా ఫోన్లు వద్దా? నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర రూ.10,000 లోపే

    ఎంఐ 10టీ 5జీ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల పుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్)
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865
    రియర్ కెమెరా: 64+13+5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్
    ధర: సుమారు రూ.43,000
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Android 10, Flipkart, MIUI 12, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు