Xiaomi Mi 10: రేపే షావోమీ ఎంఐ 10 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Xiaomi Mi 10 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మే 8న షావోమీ ఎంఐ 10 ఇండియాకు రాబోతోంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 7, 2020, 4:51 PM IST
Xiaomi Mi 10: రేపే షావోమీ ఎంఐ 10 రిలీజ్... ఫీచర్స్ ఇవే
Xiaomi Mi 10: షావోమీ ఎంఐ 10 వచ్చేస్తోంది... మే 8న రిలీజ్
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్ ఈవెంట్లన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు లాక్‌డౌన్ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఉండటంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వ్యాపారాలను మొదలుపెట్టాయి. షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మే 8న ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేస్తామని తెలిపింది. వాస్తవానికి ఈ ఫోన్ గతంలోనే రిలీజ్ కావాల్సి ఉండగా... కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలోనే ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 5జీ కనెక్టివిటీ సపోర్ట్, 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం మరో హైలైట్.

షావోమీ ఎంఐ 10 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 865
రియర్ కెమెరా: 108+13+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,780 ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 11+ఆండ్రాయిడ్ 10
ధర:
8జీబీ+128జీబీ- సుమారు రూ.41,000
8జీబీ+256జీబీ- సుమారు రూ.44,000
12జీబీ+256జీబీ- సుమారు రూ.44,000

ఇవి కూడా చదవండి:

Samsung: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి... లేటెస్ట్ రేట్స్ ఇవే

Pay Rent: క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించొచ్చు... ఈ యాప్‌తో సాధ్యం

Photography: ఫోటోగ్రఫీ ఇష్టమా? తెలుగులో ఆన్‌లైన్ క్లాసుల్ని అందిస్తున్న కెనాన్
Published by: Santhosh Kumar S
First published: May 7, 2020, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading