Redmi 8: సర్‌ప్రైజ్ ఇచ్చిన షావోమీ... దీపావళి కన్నా ముందే రెడ్‌మీ 8 రిలీజ్

Redmi 8 Release | రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే రెడ్‌మీ 8 మోడల్‌లో ఫీచర్లు అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతున్నాయి. డ్యుయెల్ కెమెరా, భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.

news18-telugu
Updated: October 3, 2019, 2:15 PM IST
Redmi 8: సర్‌ప్రైజ్ ఇచ్చిన షావోమీ... దీపావళి కన్నా ముందే రెడ్‌మీ 8 రిలీజ్
Redmi 8: సర్‌ప్రైజ్ ఇచ్చిన షావోమీ... దీపావళి కన్నా ముందే రెడ్‌మీ 8 రిలీజ్ (image: Xiaomi)
news18-telugu
Updated: October 3, 2019, 2:15 PM IST
షావోమీ ఫ్యాన్స్‌కు ఇది మరో గుడ్ న్యూస్. దసరా వేడుకలు ఇలా ముగియగానే మరో కొత్త ఫోన్ లాంఛ్ చేయబోతోంది షావోమీ. దీపావళి కన్నా ముందే ఇండియాలో రెడ్‌మీ 8 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఇండియాకు రెడ్‌మీ 8 సిరీస్‌ను పరిచయం చేసింది షావోమీ. కొద్దిరోజుల క్రితమే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 8ఏ రిలీజ్ చేసింది షావోమీ. దసరా సేల్‌లో ఈ ఫోన్ గురించి బాగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు దసరా వేడుకలు పూర్తికాకముందే మరో గుడ్ న్యూస్ చెప్పింది. దసరా మరుసటి రోజు అక్టోబర్ 9న రెడ్‌మీ 8 రిలీజ్ చేయబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించింది షావోమీ. వరుసగా కొత్త ఫోన్లు రిలీజ్ చేస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. టీజర్‌లో కనిపించే ఇమేజ్‌ను బట్టి షావోమీ రిలీజ్ చేయబోయేది రెడ్‌మీ 8 అన్న ప్రచారం జరుగుతోంది. రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే రెడ్‌మీ 8 మోడల్‌లో ఫీచర్లు అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతున్నాయి. డ్యుయెల్ కెమెరా, భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి.



రెడ్‌మీ 8 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్‌ప్లే: 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ డిస్‌ప్లే
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 439
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్:
కలర్స్: రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

WhatsApp: మీరు పంపిన వాట్సప్ మెసేజ్‌ను 5 సెకండ్లలో మాయం చేయొచ్చు

Smartphone: సెప్టెంబర్‌లో రిలీజైన కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... వీటిలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Smartphone offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 లోపు బెస్ట్ 20 స్మార్ట్‌ఫోన్లు ఇవే...
First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...