షావోమీ ఇటీవల ఇండియాలో ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 2021 జనవరి 7న తొలిసేల్ జరిగింది. అమెజాన్‌తో పాటు షావోమీ వెబ్సైట్లో ఈ సేల్ జరిగింది. ఈ సేల్ ద్వారా షావోమీ ఎన్ని ఫోన్లు అమ్మిందో తెలుసా? ఏకంగా రూ.200 కోట్ల విలువైన ఫోన్లు. అంటే ఏకంగా 1,00,000 యూనిట్లపైనే. తొలి సేల్ ద్వారా ఈ రికార్డు సాధించామని షావోమీ ప్రకటిస్తోంది. అంటే ఫస్ట్ సేల్‌లోనే 1,00,000 యూనిట్ల ఎంఐ 10ఐ మోడల్‌ను కొన్నారు కస్టమర్లు. అంతేకాదు... అమెజాన్‌లో టాప్ 5 సెల్లింగ్ ప్రొడక్ట్స్‌లో ఎంఐ 10ఐ నిలిచింది. ఎంఐ 10ఐ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.23,999. అయితే ఇందులో 6జీబీ+64జీబీ వేరియంట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. జియో నుంచి రూ.10,000 బెనిఫిట్స్ ఉంటాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఎంఐ 10ఐ సేల్ కొనసాగుతోంది.
Tata Sky: మీ ఇంట్లో టాటా స్కై కనెక్షన్ ఉందా? అయితే ఈ కారు గెలుచుకోవచ్చు
WhatsApp: వాట్సప్ వద్దా? అయితే 5 మెసేజింగ్ యాప్స్ ట్రై చేయొచ్చు
షావోమీ ఎంఐ 10ఐ విశేషాలు చూస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 4,820ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ముందు, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ చూస్తే 108మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. హెచ్డీఆర్, గూగుల్ లెన్స్, నైట్ మోడ్ 2.0, ప్రో మోడ్, పనోరమా, రా మోడ్, 4కే వీడియో రికార్డింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా
Prepaid Plans: రూ.250 లోపు Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే...
సెల్ఫీల కోసం ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్ 1.0, ఏఐ బ్యూటీ, ఏఐ పోర్ట్రైట్ మోడ్, ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 4,820ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 100 శాతం కేవలం 58 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని ప్రకటించింది కంపెనీ. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను అట్లాంటిక్ బ్లూ, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.