Poco M2 Pro: షావోమీ నుంచి మరో సర్‌ప్రైజ్... పోకో ఎం2 ప్రో వచ్చేస్తోంది

Poco M2 Pro: షావోమీ నుంచి మరో సర్‌ప్రైజ్... పోకో ఎం2 ప్రో వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)

Poco M2 Pro | షావోమీ ఇండియాలో పోకో ఎం2 ప్రో పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసే అవకాశముంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు షావోమీ ఇండియా వెబ్‌సైట్‌లో కనిపించాయి.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ అనేక రికార్డుల్ని సృష్టించింది. రెడ్‌మీ, ఎంఐ, పోకో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తూ వేర్వేరు వర్గాలను ఆకట్టుకుంటోంది. షావోమీ రెండేళ్ల క్రితం పోకో సిరీస్‌లో రిలీజ్ చేసిన మొదటి స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 అనేక సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసింది. ఇటీవల పోకో ఎక్స్2 రిలీజ్ చేసింది. మే 8న ఎంఐ10 మోడల్ రిలీజ్ చేయబోతోంది. అంతేకాదు... త్వరలో పోకో ఎఫ్2 ప్రో రిలీజ్ చేయనుందన్న వార్తలొస్తున్నాయి. వీటితో పాటు పోకో సిరీస్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో పోకో ఎం2 ప్రో స్మార్ట్‌ఫోన్ వస్తోందని ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం షావోమీ ఇండియా వెబ్‌సైట్‌లో పోకో ఎం2 ప్రో పేరు కనిపించడమే. దీంతో పోకో ఎక్స్‌2 చీపర్ వేరియంట్‌గా పోకో ఎం2 ప్రో రావొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఈ ఫోన్ రెడ్‌మీ నోట్ 9 ప్రో లాగానే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

    ప్రస్తుతం మార్కెట్‌లో పోకో ఎఫ్1, పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలు నిజమైతే త్వరలో పోకో సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లు పోకో ఎం2 ప్రో, పోకో ఎఫ్2 ప్రో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. చైనాలో రిలీజ్ అయిన రెడ్‌మీ కే30 ప్రో మోడల్‌ను రీబ్రాండెడ్ చేసి ఇండియాలో పోకో ఎఫ్2 ప్రో పేరుతో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. చైనాలో రెడ్‌మీ కే30 ప్రో జూమ్ ఎడిషన్, రెడ్‌మీ కే30 ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. వీటిలో డ్యూయెల్ మోడ్ 5జీ, వైఫై 6 సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, టైప్ సీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

    ఇవి కూడా చదవండి:

    WhatsApp: పేటీఎం, గూగుల్ పేకు పోటీగా వాట్సప్ పేమెంట్ సేవలు... ఈ నెలలోనే ప్రారంభం

    COVID-19: లాక్‌డౌన్‌లో మీకు ఉపయోగపడే 5 యాప్స్ ఇవే...

    SBI Loan: 45 నిమిషాల్లో రూ.5,00,000 వరకు లోన్... అప్లై చేయండిలా
    Published by:Santhosh Kumar S
    First published: