• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI INDIA LAUNCHES MI 11 ULTRA MI 11X PRO AND MI 11X SMARTPHONES KNOW PRICE AND SPECIFICATIONS SS

Xiaomi Mi 11: ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

Xiaomi Mi 11: ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

Xiaomi Mi 11: ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే (image: Xiaomi India)

Xiaomi Mi 11 Series | షావోమీ ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఎంఐ 11 అల్‌ట్రా, ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ ఇండియాలో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసింది. ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11 అల్‌ట్రా, ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని రిలీజ్ చేసింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ మూడు ఫోన్లను పరిచయం చేసింది షావోమీ. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్స్ గతంలో తెలిసినవే. చైనాలో ఎంఐ 11 అల్‌ట్రా గతంలోనే రిలీజైంది. అమ్మకాల్లో అనేక రికార్డుల్ని బద్దలుగొట్టింది. ఇక ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్ అందరూ ఉహించినట్టుగానే రెడ్‌మీ కే40, రెడ్‌మీ కే40 ప్రో+ రీబ్రాండెడ్ వర్షన్స్. ఈ రెండు ఫోన్లు చైనాలో ఫిబ్రవరిలో లాంఛ్ అయ్యాయి. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ఈ మూడు స్మార్ట్‌ఫోన్లను ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది షావోమీ. ఎంఐ 11 అల్‌ట్రా ప్రారంభ ధర రూ.69,990. ఇది 12జీబీ+256జీబీ వేరియంట్ ధర. కేవలం ఒకే వేరియంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. సేల్ ఎప్పుడు ఉంటుందో కంపెనీ ప్రకటించలేదు. అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు.

    ఇక ఎంఐ 11ఎక్స్ ప్రారంభ ధర రూ.29,999. ఇది 6జీబీ+128జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 8జీబీ+128జీబీ మోడల్ కూడా రిలీజ్ అయింది. ధర రూ.31,999. మొదటి సేల్ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొంటే రూ.3,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బండిల్ ఆఫర్‌లో భాగంగా ఎంఐ బ్యాండ్ 5 ఫిట్‌నెస్ బ్యాండ్‌ను రూ.500 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎంఐ 11ఎక్స్ ప్రో 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,990 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.41,999. మొదటి సేల్ ఏప్రిల్ 24న ప్రారంభం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో కొంటే రూ.4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

    Realme 8 5G: రియల్‌మీ సంచలనం... రూ.14,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

    WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి


    ఎంఐ 11 అల్‌ట్రా స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్
    ర్యామ్: 12జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 256జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
    రియర్ కెమెరా: 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 48 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్+ 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (67వాట్ ఫాస్ట్ వైర్‌లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: సిరామిక్ బ్లాక్, సిరామిక్ వైట్
    ధర:
    12జీబీ+256జీబీ- రూ.69,990

    Android Apps: అలర్ట్... మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి

    Oppo A54: ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి


    ఎంఐ 11ఎక్స్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌ హెచ్‌డీ+ ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870
    రియర్ కెమెరా: 48మెగాపిక్సెల్ Sony IMX582 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,520ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 2.5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
    సిమ్ సపోర్ట్:
    కలర్స్: సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, ఫ్రాస్టీ వైట్
    ధర:
    6జీబీ+128జీబీ- రూ.29,999
    8జీబీ+128జీబీ- రూ.31,999

    JioFiber Free Trial: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ వివరాలివే

    Poco M2 Reloaded: పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే

    ఎంఐ 11ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌ హెచ్‌డీ+ ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
    ర్యామ్: 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
    రియర్ కెమెరా: 108 మెగాపిక్సెల్ సాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,520ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 2.5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, ఫ్రాస్టీ వైట్
    ధర:
    8జీబీ+128జీబీ- రూ.39,990
    8జీబీ+256జీబీ- రూ.41,999
    Published by:Santhosh Kumar S
    First published: