Home /News /technology /

XIAOMI INDIA LAUNCHES MI 10 SMARTPHONE WITH 108 MEGAPIXEL CAMERA KNOW PRICE AND SPECIFICATIONS SS

Xiaomi Mi 10: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రిలీజ్ అయిన షావోమీ ఎంఐ 10

Xiaomi Mi 10: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రిలీజ్ అయిన షావోమీ ఎంఐ 10
(image: Xiaomi India)

Xiaomi Mi 10: 108 మెగాపిక్సెల్ కెమెరాతో రిలీజ్ అయిన షావోమీ ఎంఐ 10 (image: Xiaomi India)

Xiaomi Mi 10 | షావోమీ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఎంఐ 10 మోడల్‌ను పరిచయం చేసింది షావోమీ.

    షావోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. లాక్‌డౌన్ వల్ల ఇటీవల స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ ఈవెంట్స్ అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో షావోమీ బిజినెస్ ప్రారంభించింది. ఇండియన్ మార్కెట్లోకి ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. భారీ కెమెరా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఎంఐ 10 రిలీజ్ కావడం విశేషం. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ఫ్లే, 90Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 5జీ కనెక్టివిటీ సపోర్ట్, వైఫై 6 సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇప్పటికే చైనాలో ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎంఐ 10 మోడల్‌ను మాత్రమే ఇండియాలో రిలీజ్ చేసింది షావోమీ.

    ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌ను 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజ్ చేసింది షావోమీ. ప్రారంభ ధర రూ.49,999. ఎంఐ 10 ప్రీ-బుకింగ్ చేసిన వారికి రూ.2,500 విలువైన వైర్‌లెస్ పవర్ బ్యాంక్ ఉచితం. ప్రీ-బుకింగ్ మే 8 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనేవారికి రూ.3,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

    షావోమీ ఎంఐ 10 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
    ర్యామ్: 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 865
    రియర్ కెమెరా: 108+13+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,780 ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 11+ఆండ్రాయిడ్ 10
    ధర:
    8జీబీ+128జీబీ- రూ.49,999
    8జీబీ+256జీబీ- రూ.54,999

    ఇవి కూడా చదవండి:

    Jio Prepaid Plan: ఈ జియో ప్లాన్ రీఛార్జ్ చేస్తే 102 జీబీ డేటా వాడుకోవచ్చు

    Samsung: టీవీ కొంటే 15% క్యాష్‌బ్యాక్... సాంసంగ్ ఆఫర్

    SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌... ఈ స్టెప్స్‌తో చాలా ఈజీ
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Android 10, Smartphone, Smartphones, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు