• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • XIAOMI INDIA LAUNCHED REDMI NOTE 10 PRO MAX REDMI NOTE 10 PRO AND REDMI NOTE 10 SMARTPHONES KNOW PRICE AND SPECIFICATIONS SS

Redmi Note 10 Series: రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.11,999 నుంచి

Redmi Note 10: రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.11,999 నుంచి (image: Redmi India)

Redmi Note 10 Series | రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. వీటి ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రెడ్‌మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను పరిచయం చేసింది షావోమీ. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్‌కు అప్‌గ్రేడ్ వర్షన్స్. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో సూపర్ అమొలెడ్ డిస్‌ప్లేను పరిచయం చేసింది షావోమీ. 5000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. షావోమీ ఫోన్ బాక్సులోనే ఫాస్ట్ ఛార్జర్లను అందిస్తోంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లను అమెజాన్‌తో పాటు ఎంఐ స్టోర్స్, ఎంఐ అధికారిక వెబ్‌సైట్లలో కొనొచ్చు. లాంఛింగ్ ఆఫర్లలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. జియోలో రూ.349 కన్నా ఎక్కువ ప్లాన్స్‌పై రూ.10,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

    రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.11,999. ఇది 4జీబీ+64జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999. రెడ్‌మీ నోట్ 10 సేల్ మార్చి 16న మొదలుకానుంది. ఇక రెడ్‌మీ నోట్ 10 ప్రో ధర చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.15,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999. రెడ్‌మీ నోట్ 10 ప్రో సేల్ మార్చి 19న మొదలవుతుంది. రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ధర చూస్తే 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.18,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.19,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మార్చి 18న మొదలవుతుంది.

    Best 5G Smartphones: కొత్త మొబైల్ కొంటున్నారా? రూ.20,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Samsung Galaxy A12: సాంసంగ్ గెలాక్సీ ఏ12 కొనేవారికి ఆఫర్... జియో నుంచి రూ.7,000 బెనిఫిట్స్


    రెడ్‌మీ నోట్ 10 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ Sony IMX58 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: ఆక్వా గ్రీన్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ వైట్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.11,999
    6జీబీ+128జీబీ- రూ.13,999


    రెడ్‌మీ నోట్ 10 ప్రో స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ
    రియర్ కెమెరా: 64మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL GW3 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా:
    బ్యాటరీ: 5020ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్
    కలర్స్:
    ధర:
    6జీబీ+64జీబీ- రూ.15,999
    6జీబీ+128జీబీ- రూ.16,999
    8జీబీ+128జీబీ- రూ.18,999


    రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ
    రియర్ కెమెరా: 108మెగాపిక్సెల్ సాంసంగ్ ISOCELL GW3 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5020ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్
    కలర్స్: వింటేజ్ బ్రాంజ్, గ్లాసియల్ బ్లూ, డార్క్ నైట్
    ధర:
    6జీబీ+64జీబీ- రూ.18,999
    6జీబీ+128జీబీ- రూ.19,999
    8జీబీ+128జీబీ- రూ.21,999
    Published by:Santhosh Kumar S
    First published: