Redmi 9 Activ: సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ఫీచర్స్ ఇవే

Redmi 9 Activ: సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ఫీచర్స్ ఇవే (image: Redmi India)

Redmi 9 Activ | తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రెడ్‌మీ 9 యాక్టీవ్ (Redmi 9 Activ) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది షావోమీ. స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది షావోమీ ఇండియా. సైలెంట్‌గా ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. రెడ్‌మీ 9 యాక్టీవ్ (Redmi 9 Activ) మోడల్‌ను పరిచయం చేసింది. షావోమీ ఫ్యాన్స్ రెడ్‌మీ 10 సిరీస్ (Redmi 10 Series) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. రెడ్‌మీ 10 సిరీస్‌లో మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ వస్తాయనుకుంటే రెడ్‌మీ 9 సిరీస్‌లో రెడ్‌మీ 9 యాక్టీవ్ మొబైల్‌ను లాంఛ్ చేసింది. ఇప్పటికే రెడ్‌మీ 9 సిరీస్‌లో రెడ్‌మీ 9 పవర్, రెడ్‌మీ 9 ప్రైమ్, రెడ్‌మీ 9, రెడ్‌మీ 9ఐ, రెడ్‌మీ 9ఏ మోడల్స్ ఉన్న సంగతి తెలిసిందే.

    ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 24న అమెజాన్‌లో ప్రారంభం కానుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంఛ్ చేస్తున్నట్టు రెడ్‌మీ ఇండియా ట్విట్టర్‌లో ప్రకటించింది. ధర ఎంతో ఇంకా వెల్లడించలేదు. రెడ్‌మీ 9 యాక్టీవ్ ఇప్పటికే ఉన్న రెడ్‌మీ 9 అప్‌గ్రేడ్ మోడల్ అని అంచనా వేస్తున్నారు. రెడ్‌మీ 9 యాక్టీవ్ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, షావోమీ ఇండియా వెబ్‌సైట్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఎంఐ స్టూడియోలో కొనొచ్చు.

    Infinix: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఇవే


    రెడ్‌మీ 9 యాక్టీవ్ స్పెసిఫికేషన్స్ కూడా పూర్తిగా తెలియదు. కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రచారంలో ఉన్నాయి. 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    Vivo V20 Pro: రూ.30 వేల 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10 వేలకే సొంతం చేసుకోండి... అమెజాన్‌లో ఆఫర్

    రెడ్‌మీ 9 యాక్టీవ్ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 35 గంటల టాక్‌టైమ్ వస్తుంది. మెటాలిక్ బ్లూ కలర్‌లో కొనొచ్చు. ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవే. సేల్ మొదలయ్యాక పూర్తి స్పెసిఫికేషన్స్ తెలిసే అవకాశం ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published: