Home /News /technology /

XIAOMI INDIA INCREASES REDMI NOTE 10 AND REDMI NOTE 10T 5G PRICE BY RS 500 SS

Price Hike: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... రెండు మోడళ్ల ధరలు పెంచిన షావోమీ

Price Hike: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... రెండు మోడళ్ల ధరలు పెంచిన షావోమీ
(image: Xiaomi India)

Price Hike: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... రెండు మోడళ్ల ధరలు పెంచిన షావోమీ (image: Xiaomi India)

Price Hike | రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే అలర్ట్. షావోమీ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచేసింది. షావోమీ ఇటీవల వరుసగా కొత్త మోడల్స్ ధరల్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచింది.

ఇంకా చదవండి ...
    రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10టీ 5జీ మొబైళ్ల ధరలు పెరిగాయి. ఇవి రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్స్. మొదట తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్న షావోమీ... ఆ తర్వాత వాటి ధరల్ని పెంచుతూ షాకిస్తోంది. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.11,999 కాగా ఆ తర్వాత రూ.1,000 పెరిగింది. దీంతో ధర రూ.12,999 కి చేరుకుంది. ఇప్పుడు మరో రూ.500 పెరగడంతో ఈ మొబైల్ ధర రూ.13,499 కి చేరుకుంది. ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.13,999 కాగా, ఆ తర్వాత రూ.1,000 పెరిగింది. తాజాగా మరో రూ.500 పెరిగింది. ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే రూ.15,499 చెల్లించాలి. ఇక రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.13,999 కాగా రూ.500 పెరిగింది. దీంతో ధర రూ.14,499 కి చేరుకుంది. ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రిలీజ్ అయినప్పుడు రూ.15,999 కాగా రూ.500 పెరిగింది. ప్రస్తుత ధర రూ.16,499.

    UMANG App: పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయండి

    Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయడం మర్చిపోవద్దు

    రెడ్‌మీ నోట్ 10టీ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లతో 48 మెగాపిక్సెల్ Sony IMX58 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆక్వా గ్రీన్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు.

    WhatsApp Messages: వాట్సప్‌లో ముఖ్యమైన మెసేజెస్ సేవ్ చేయండి ఇలా

    Vivo V19: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

    ఇక రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Redmi, Smartphone, Smartphones, Xiaomi

    తదుపరి వార్తలు