Smart Bands: షియోమి ఎంఐ బ్యాండ్ 6 వర్సెస్ వన్‌ప్లస్ బ్యాండ్.. రెండు స్మార్ట్ బ్యాండ్ల ధర, ఫీచర్లు ఇవే

Smart Bands: షామి ఎంఐ బ్యాండ్ 6 వర్సెస్ వన్‌ప్లస్ బ్యాండ్..రెండు స్మార్ట్ బ్యాండ్ల ధర ఇదే

స్మార్ట్‌ఫోన్ల తయారీతో పాటు స్మార్ట్‌బ్యాండ్‌ల మార్కెట్లో సైతం దూసుకుపోతున్నాయి షియోమి, వన్‌ప్లస్ సంస్థలు. షియోమి ఇటీవల నెక్ట్స్ జెనరేషన్ ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను విడుదల చేసింది. మెరుగైన డిస్‌ప్లే, మరిన్ని ఫిట్‌నెస్ మోడ్‌లతో దీన్ని లాంచ్ చేసింది. దీని ధర రూ.3,499గా ఉంది. వన్‌ప్లస్ బ్యాండ్ ధర రూ.2,499 నుంచి ప్రారంభమవుతోంది.

  • Share this:
స్మార్ట్‌ఫోన్ల తయారీతో పాటు స్మార్ట్‌బ్యాండ్‌ల మార్కెట్లో సైతం దూసుకుపోతున్నాయి షియోమి, వన్‌ప్లస్ సంస్థలు. షియోమి ఇటీవల నెక్ట్స్ జెనరేషన్ ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను విడుదల చేసింది. మెరుగైన డిస్‌ప్లే, మరిన్ని ఫిట్‌నెస్ మోడ్‌లతో దీన్ని లాంచ్ చేసింది. దీని ధర రూ.3,499గా ఉంది. వన్‌ప్లస్ బ్యాండ్ ధర రూ.2,499 నుంచి ప్రారంభమవుతోంది. ఈ రెండు స్మార్ట్‌బ్యాండ్లలో బ్లడ్ ఆక్సిజన్ (SpO2) స్థాయిలను తెలుసుకోవచ్చు. రెండు డివైజ్‌లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 14 రోజుల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతం వేరబుల్ మార్కెట్లో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ రెండు స్మార్ట్‌బ్యాండ్ల ధర, ఫీచర్లను పోల్చి చూద్దాం.

డిజైన్
ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6ను 1.56 అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో రూపొందించారు. ఇది 1.1 అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ 326ppi పిక్సెల్ రిజల్యూషన్‌తో, 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. OnePlus బ్యాండ్ కూడా 1.1 అంగుళాల AMOLED, టచ్-సపోర్ట్ డిస్‌ప్లేతో విడుదలైంది. ఇది 126 × 294 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో లభిస్తోంది. ఈ రెండు ఫిట్‌నెస్ బ్యాండ్‌లను పిల్ షేప్‌ ప్యానెల్‌తోనే డిజైన్‌ చేశారు. Mi బ్యాండ్ 6, వన్‌ప్లస్ బ్యాండ్‌లు రెండూ బ్లాక్ కలర్ స్ట్రాప్‌లతో వస్తాయి. అయితే కస్టమర్లు కలర్ బ్యాండ్‌లను సైతం విడిగా కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు
ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6, వన్‌ప్లస్ బ్యాండ్ రెండింట్లో SpO2 స్థాయిలు, స్లీప్ సైకిల్, హార్ట్ బీట్ రేటును ట్రాక్ చేసే ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ వేరబుల్స్ 5ATM వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో లభిస్తున్నాయి. ఎంఐ బ్యాండ్ 6 ఏకంగా 30 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ బ్యాండ్ 13 ఎక్సర్‌సైజ్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ
వన్‌ప్లస్ బ్యాండ్ 100mAh బ్యాటరీతో లభిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అయితే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 మాత్రం 125mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 14 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని పేర్కొంది. రెండూ మాగ్నెటిక్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తాయి.

కనెక్టివిటీ
ఎంఐ బ్యాండ్ 6, వన్‌ప్లస్ బ్యాండ్ రెండూ బ్లూటూత్ v5.0కి సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్, యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లతో పనిచేస్తాయి. మ్యూజిక్ వినడంతో పాటు కనెక్ట్ చేసిన స్మార్ట్‌ఫోన్‌తో రిమోట్ షట్టర్ బటన్‌ ద్వారా ఫోటోలు తీసుకోవచ్చు. దీంతోపాటు స్మార్ట్ నోటిఫికేషన్‌లు, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్ వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లను యూజర్లు యాక్సెస్ చేయవచ్చు.
Published by:Krishna Adithya
First published: