• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • XIAOMI INDIA HAS ANNOUNCED RECENTLY LAUNCHED MI 10I SETS A NEW RECORD IN SALES SSR

ఎంఐ దుమ్ములేపిందిగా.. మూడు వారాల్లోనే ఆ మోడల్‌పై అన్ని కోట్ల అమ్మకాలా..!

ఎంఐ దుమ్ములేపిందిగా.. మూడు వారాల్లోనే ఆ మోడల్‌పై అన్ని కోట్ల అమ్మకాలా..!

ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో అందించడంలో ముందు వరుసలో ఉండే చైనా ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ భారత్‌లో దూసుకుపోతోంది. ఇటీవల షియోమీ తీసుకొచ్చిన ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కేవలం మూడు వారాల వ్యవధిలో ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్‌ఫోన్లపై రూ.400 కోట్ల విక్రయాలు...

  • Share this:
    బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో అందించడంలో ముందు వరుసలో ఉండే చైనా ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ భారత్‌లో దూసుకుపోతోంది. ఇటీవల షియోమీ తీసుకొచ్చిన ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కేవలం మూడు వారాల వ్యవధిలో ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్‌ఫోన్లపై రూ.400 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. భారత్‌లో ఈ మోడల్‌ను జనవరి 7న సంస్థ విడుదల చేసింది. ఎంఐ 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లోనే కాదు స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకర్షించడంలో కూడా ముందున్నట్లు షియోమీ తెలిపింది.

    2021 జనవరిలో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన స్మార్ట్‌ఫోన్లలో ఎంఐ 5జీ ఫోన్ కూడా ఒకటని ఆ సంస్థ పేర్కొంది. ఎంఐ 5జీ ఫోన్‌కు వచ్చిన స్పందన తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్‌లో మరిన్ని మెరుగైన ఉత్పత్తులను ఎంఐ ఫ్యాన్స్‌కు అందించేందుకు కృషి చేస్తామని ఎంఐ ఇండియా విభాగ ప్రతినిధులు తెలిపారు. ఎంఐ తీసుకొచ్చిన 5జీ స్మార్ట్‌ఫోన్ రూ,20,999 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంది. షియోమీ ఎంఐ 10ఐ 5జీ సిరీస్‌లో 6జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర 21,999 రూపాయలు కావడం గమనార్హం.

    8జీబీ, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర 23,999 రూపాయలు. పసిఫిక్ సన్‌రైజ్, మిడ్‌నైట్ బ్లాక్, అట్లాంటిక్ బ్లూ కలర్స్‌లో ఎంఐ 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు ఎంఐ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4,820 ఎంఏహెచ్ కాగా, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు