Redmi K20: వన్‌ప్లస్‌ 7 సిరీస్‌కు పోటీగా రెడ్‌మీ కే20

Redmi K20 | గతేడాది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ పోకో ఎఫ్1 రిలీజ్ చేసిన షావోమీ... ఈ ఏడాది పోకో ఎఫ్‌2 రిలీజ్ చేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ రాబోయేవి రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్స్ అని తేలిపోయింది.

news18-telugu
Updated: May 15, 2019, 6:13 PM IST
Redmi K20: వన్‌ప్లస్‌ 7 సిరీస్‌కు పోటీగా రెడ్‌మీ కే20
Redmi K20: వన్‌ప్లస్‌ 7 సిరీస్‌కు పోటీగా రెడ్‌మీ కే20 (image: @XiaomiIndia/twitter)
news18-telugu
Updated: May 15, 2019, 6:13 PM IST
వన్‌ప్లస్ 7 సిరీస్ గ్రాండ్‌గా రిలీజైంది. వన్‌ప్లస్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అయితే వన్‌ప్లస్ కంపెనీకి ప్రత్యర్థి అయిన షావోమీ కంగ్రాట్స్ చెప్పడం అందరికీ షాకిచ్చింది. కంగ్రాట్స్ చెబుతూనే ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0 త్వరలో రాబోతున్నట్టు ప్రకటించింది షావోమీ. వన్‌ప్లస్ 7 సిరీస్ రిలీజ్ ఎంత హైలైట్ అయిందో, షావోమీ టీజర్ కూడా అంతే ఆకట్టుకుంటోంది. వన్‌ప్లస్ 7 సిరీస్ రిలీజ్‌ను తమ ఫోన్ ప్రమోషన్ కోసం తెలివిగా వాడుకుంది షావోమీ. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌తో రాబోయే తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ పేరు Redmi K20 అని హింట్ ఇచ్చింది. వన్‌ప్లస్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలు రూ.32,999 నుంచి మొదలవుతున్నాయి. షావోమీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అంతకన్నా తక్కువ ధరకే రానున్నాయని అంచనా.




రెడ్‌మీ కే20 మోడల్‌తో పాటు రెడ్‌మీ కే20 ప్రో ఫోన్ రిలీజ్ కానుంది. గతేడాది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ పోకో ఎఫ్1 రిలీజ్ చేసిన షావోమీ... ఈ ఏడాది పోకో ఎఫ్‌2 రిలీజ్ చేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ రాబోయేవి రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్స్ అని తేలిపోయింది. ఈ రెండు ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌తో రానున్నాయి. రెడ్‌మీ కే20 ప్రో స్పెసిఫికేషన్స్‌పై రూమర్స్ ఉన్నాయి. రెడ్‌మీ కే20 ప్రో 6.39 అంగుళాల అమొలెడ్ నాచ్‌లెస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 48+16+8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా, 27 వాట్ ఛార్జర్‌ సపోర్ట్‌తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని అంచనా.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Realme C2: ఎక్స్‌ఛేంజ్‌లో రూ.2,000 ధరకే రియల్‌మీ సీ2... కొందరికి మాత్రమే

Credit Card: క్రెడిట్ కార్డ్ కావాలా? ఈ టిప్స్ మీకోసమే...
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...