హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi 9: రేపే రెడ్‌మీ 9 లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Redmi 9: రేపే రెడ్‌మీ 9 లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Redmi 9: రేపే రెడ్‌మీ 9 లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Redmi 9: రేపే రెడ్‌మీ 9 లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Redmi 9 launch in India | షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రెడ్‌మీ 9 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్లు వస్తున్నాయి. రూ.10,000 లోపు సెగ్మెంట్‌పైన కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. రియల్‌మీ సీ15, రియల్‌మీ సీ12 లాంఛ ్అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు షావోమీ నుంచి రెడ్‌మీ 9 ప్రైమ్ వచ్చింది. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ 9 ప్రైమ్ ఫోన్లను పరిచయం చేసింది షావోమీ. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో ఫోన్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే ఇతర దేశాల్లో రిలీజైన రెడ్‌మీ 9సీ లేదా రెడ్‌మీ 9ఏ మోడల్‌ను రీబ్రాండ్ చేసి ఇండియాలో రెడ్‌మీ 9 పేరుతో లాంఛ్ చేసే అవకాశం ఉంది. రెడ్‌మీ 9 లాంఛింగ్ గురించి అధికారికంగా ప్రకటించింది షావోమీ. ఆగస్ట్ 27 ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌ను రెడ్‌మీ 9 ప్రైమ్ పేరుతో లాంఛ్ చేశారని అంతా భావించారు. ఇక ఈ సిరీస్‌లో రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ ఉండదనే అనుకున్నారు. కానీ షావోమీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో మరో ఫోన్ ఉన్నట్టు ప్రకటించింది.

  Mobile Apps: మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే ఈ 23 యాప్స్ డిలిట్ చేయండి

  Oppo A53: ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్ కొంటే భారీ డిస్కౌంట్... ఎస్‌బఐ కార్డుపై మాత్రమే

  రెడ్‌మీ 9 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  డిస్‌ప్లే: 6.53 అంగుళాల హెచ్‌డీ+

  ర్యామ్: 2జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ25

  రియర్ కెమెరా: 13+2+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్:

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: మిడ్‌నైట్ గ్రే, పికాక్ గ్రీన్, ట్విలైట్ బ్లూ

  ధర: సుమారు రూ.6,300

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Redmi, Smartphone, Smartphones, Xiaomi

  ఉత్తమ కథలు