XIAOMI INDIA ANNOUNCED LAUNCHING OF MI 10 WITH 108 MEGAPIXEL CAMERA AND SNAPDRAGON 865 PROCESSOR ON MARCH 31 SS
Xiaomi Mi 10: వామ్మో... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ఫోన్... మార్చి 31న రిలీజ్
Xiaomi Mi 10: వామ్మో... 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ఫోన్... మార్చి 31న రిలీజ్
(ప్రతీకాత్మక చిత్రం)
Xiaomi Mi 10 | మీరు మంచి కెమెరా ఉన్న స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మార్చి 31 వరకు ఆగండి. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ఫోన్ రిలీజ్ కాబోతోంది.
స్మార్ట్ఫోన్కు కెమెరా ఎంత ఉండాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానమే ఉండట్లేదు. ఒకప్పుడు 8 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ఫోన్ ఉండటమే గొప్ప. కానీ ఇప్పుడు 64 మెగాపిక్సెల్ ట్రెండ్ నడుస్తోంది. ఇది ఇంతటితో ఆగట్లేదు. త్వరలో 108 మెగాపిక్సెల్ స్మార్ట్ఫోన్ రాబోతోంది. ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన షావోమీ... 108 మెగాపిక్సెల్ కెమెరా గల స్మార్ట్ఫోన్ను భారతదేశానికి తీసుకురాబోతోంది. చైనాలో ఫిబ్రవరిలోనే షావోమీ ఎంఐ 10 స్మార్ట్ఫోన్ రిలీజ్ అయింది. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. ఈ ఫోన్ ఇండియాకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ను షావోమీ ఇండియా కన్ఫామ్ చేసింది. మార్చి 31న షావోమీ ఎంఐ 10 స్మార్ట్ఫోన్ను ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు షావోమీ ఎంఐ 10 5జీ మోడల్ని కూడా తీసుకొచ్చే అవకాశముంది. ఎంఐ 10 స్మార్ట్ఫోన్లో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్, వైఫై 6 సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Dropping the big news.#Mi10 𝐢𝐬 𝐥𝐚𝐮𝐧𝐜𝐡𝐢𝐧𝐠 𝐨𝐧 𝐌𝐀𝐑𝐂𝐇 𝟑𝟏𝐬𝐭 𝐚𝐭 𝟏𝟐:𝟑𝟎 𝐏𝐌.
Watch the Livestream across our social media handles.
Pre-order starts on March 31st at 3PM.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.