హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ రేట్ మళ్లీ పెరిగింది... ధర ఎంతంటే

Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ రేట్ మళ్లీ పెరిగింది... ధర ఎంతంటే

Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ రేట్ మళ్లీ పెరిగింది... ధర ఎంతంటే

Redmi Note 8: రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ రేట్ మళ్లీ పెరిగింది... ధర ఎంతంటే

Redmi Note 8 | షావోమీ రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ ధర మళ్లీ మళ్లీ పెరుగుతోంది. ఈ ఫోన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు ధర పెంచింది షావోమీ.

మార్కెట్‌లో ఓ కొత్త ఫోన్ రిలీజ్ అయిందంటే కొంతకాలం తర్వాత ధర తగ్గుతుంది. కొత్త మోడల్స్, అప్‌గ్రేడ్ వర్షన్స్ మార్కెట్లోకి వస్తాయి కాబట్టి పాత మోడళ్ల ధర తగ్గడం మామూలే. కానీ షావోమీకి చెందిన ఓ ఫోన్ ధర వరుసగా పెరుగుతూనే ఉంది. అదే రెడ్‌మీ నోట్ 8. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సార్లు రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది. గతంలో నాలుగు సార్లు ఈ ఫోన్ రేటు పెంచిన షావోమీ ఇప్పుడు ఐదోసారి ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతీసారి రూ.500 చొప్పున ఐదుసార్లు రూ.2,500 ధర పెరిగింది. ఓ స్మార్ట్‌ఫోన్ ధర ఏకంగా రూ.2,500 పెరగడం ఆశ్చర్యపరుసోతంది. రెడ్‌మీ నోట్ 8 రిలీజ్ అయినప్పుడు 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. అప్పట్లో ఇంత తక్కువ ధరకు 4జీబీ+64జీబీ ఫోన్ రిలీజ్ చేయడం సంచలనమే. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా రేటు పెరుగుతోంది. ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 8 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,499. అంటే ఏకంగా రూ.2,500 ధర పెరిగింది.

మరోవైపు 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రిలీజ్ సమయంలో రూ.12,999. ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ.14,999. అంటే 6జీబీ+64జీబీ వేరియంట్ ధర కూడా రూ.2,000 పెరిగింది. రెడ్‌మీ నోట్ 8 విశేషాలు చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

Smartphone: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్... ధర రూ.5,774 మాత్రమే

WhatsApp Banking: మీ బ్యాంకింగ్ సేవలు వాట్సప్‌లో పొందొచ్చు ఇలా

రెడ్‌మీ నోట్ 8 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే

ర్యామ్: 4జీబీ, 6జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665

రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై

కలర్స్: స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ పర్పుల్, మూన్‌లైట్ వైట్

ధర:

4జీబీ+64జీబీ- రూ.12,499

6జీబీ+128జీబీ- రూ.14,999

First published:

Tags: Android 10, MIUI 10, Redmi, Xiaomi

ఉత్తమ కథలు