Redmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ

Redmi Smartphone Price Hike | షావోమీ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది. ఆ స్మార్ట్‌ఫోన్లు ఏవో, ధరలు ఎంతో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 15, 2020, 11:18 AM IST
Redmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ
Redmi: ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచిన షావోమీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి షాక్. మూడు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచింది షావోమీ. రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ 8, రెడ్‌మీ 8ఏ డ్యూయెల్ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగాయి. ఇటీవల కాలంలో ఈ ఫోన్ల ధరల్ని షావోమీ పెంచడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఏప్రిల్ 1న కొత్త జీఎస్‌టీ ధరలు అమలులోకి వచ్చినప్పుడు ఓసారి ధరల్ని పెంచింది షావోమీ. ఇప్పుడు మరోసారి ఈ ఫోన్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెడ్‌మీ నోట్ 8 ధర రూ.500, రెడ్‌మీ 8, రెడ్‌మీ 8ఏ ధర రూ.300 చొప్పున పెరిగింది. రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 నుంచి రూ.11,499 ధరకు పెరిగింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999 అలాగే ఉంది. రెండు నెలల్లో రెడ్‌మీ నోట్ 8 ధర రూ.1,500 పెరగడం విశేషం. ఇక రెడ్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.8,999 నుంచి రూ.9,299 ధరకు పెరిగింది. రెడ్‌మీ 8ఏ డ్యూయెల్ 2జీబీ+32జీబీ వేరియంట్ రూ.6,999 నుంచి రూ.7,299 ధరకు పెరిగింది.







































































 రెడ్‌మీ నోట్ 8  రెడ్‌మీ 8రెడ్‌మీ 8ఏ
 డిస్‌ప్లే  6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే  6.2 అంగుళాల హెచ్‌డీ+  6.22 అంగుళాల హెచ్‌డీ+
 ర్యామ్  4జీబీ, 6జీబీ  3జీబీ, 4జీబీ  2జీబీ, 3జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  64జీబీ, 128జీబీ  32జీబీ, 64జీబీ  32జీబీ
 ప్రాసెసర్  స్నాప్‌డ్రాగన్ 665  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439
 రియర్ కెమెరా  48+8+2+2 మెగాపిక్సెల్  12+2 మెగాపిక్సెల్  13+2 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  13 మెగాపిక్సెల్  8 మెగాపిక్సెల్  8 మెగాపిక్సెల్
 బ్యాటరీ  4,000 ఎంఏహెచ్  5,000 ఎంఏహెచ్  5,000 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 9 పై  ఆండ్రాయిడ్ 9 పై  ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11
 కలర్స్  స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ పర్పుల్, మూన్‌లైట్ వైట్ ఓనిక్స్ బ్లాక్, రూబీ రెడ్, సఫైర్ బ్లూ సీ బ్లూ, స్కై వైట్, మిడ్‌నైట్ గ్రే
 ధర  4జీబీ+64జీబీ- రూ.11,999
6జీబీ+128జీబీ- రూ.13,999
 4జీబీ+64జీబీ- రూ.9,299  2జీబీ+32జీబీ- రూ.7,299
3జీబీ+32జీబీ- రూ.7,999

ఇవి కూడా చదవండి:

Poco F2 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎఫ్2 ప్రో రిలీజ్

IRCTC Refund: జూన్ 30 వరకు రైళ్లు రద్దు... రీఫండ్ రూల్స్ ఇవే

Realme Narzo: రియల్‌మీ నార్జో 10, నార్జో 10ఏ రిలీజ్... ఎలా ఉన్నాయో చూడండి
Published by: Santhosh Kumar S
First published: May 15, 2020, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading