షియోమి(Xiaomi) కంపెనీ రెడ్‌మీ(Redmi) బ్రాండ్‌తో రీబ్రాండెడ్ ఫోన్‌లను వివిధ మార్కెట్‌లలో విడుదల చేస్తుంటుంది. ఇప్పటికే షియోమి సబ్‌బ్రాండ్స్ నుంచి చాలా ఫోన్లు ఇలా రిలీజ్ అయ్యాయి. ఈ కంపెనీ తాజాగా మరో ఫోన్(Phone)ను రీబ్రాండెడ్ మోడల్‌గా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఇండియాలో ఇటీవల లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 10ఎస్ (Redmi Note 10S) ఫోన్‌ను షియోమి గ్లోబల్ మార్కెట్‌లలో POCO M5sగా రీబ్రాండ్ చేస్తోందని ప్రముఖ టిప్‌స్టర్ కాస్పర్ స్క్రిజిపెక్ (Kacper Skrzypek) పేర్కొన్నారు. IMEI డేటాబేస్ ద్వారా ఈ వివరాలను గుర్తించినట్లు తెలిపారు.
అయితే ఈ విషయంలో మరో గందరగోళం ఉంది. ఈ టిప్‌స్టర్ ఇండియన్ MIUI కోడ్‌లో "Redmi Note 11 SE" అనే మోనికర్‌ను గుర్తించారు. ఈ డివైజ్ ఇప్పటికే ఉన్న Redmi Note 10Sకి రీబ్రాండ్ అవుతుందని కోడ్ స్ట్రింగ్స్ వెల్లడిస్తున్నాయి. అయితే కంపెనీ కొన్ని మార్పులతో పాత ఫోన్‌ను తక్కువ ధరలో అందించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రెడ్‌మీ నోట్ 11 SE ఇండియాలో లాంచ్ అవుతుందా?
కంపెనీకి చెందిన MIUI కోడ్‌లో రెడ్‌మీ నోట్ 11 SE మోనికర్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ డివైజ్, ఇండియాలో ఇప్పటికే ఉన్న రెడ్‌మీ నోట్ 10Sకు రీబ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇదే ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్స్ కోసం POCO M5sగా కంపెనీ రీబ్రాండ్ చేయనుంది. టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ డివైజ్‌లలో RAM/స్టోరేజ్ తప్ప స్పెసిఫికేషన్ల పరంగా పెద్దగా తేడాలు ఉండవని తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 11 SE ధర రూ. 11,690 నుంచి ప్రారంభం కావచ్చు. ఈ ఫోన్ ఆగస్టు 29న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
POCO M5s ఫోన్ 4GB/64GB, 4GB/128GB, 6GB/128GB స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. రెడ్‌మీ నోట్ 10S ఒరిజినల్ వెర్షన్ 8GB/128GB, 6GB/128GB, 6GB/64GB స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. తాజా మోడల్ MIUI 13 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫోన్‌ను షియోమి వేరే పేరుతో, స్పెక్స్‌తో మళ్లీ లాంచ్ చేయాలని భావించడం కాస్త గందరగోళానికి దారితీస్తోంది.
ఇదీ చదవండి: Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!
స్పెసిఫికేషన్స్
రెడ్‌మీ నోట్ 10S డివైజ్ 60Hz రిఫ్రెష్ రేట్, 700 nits బ్రైట్‌నెస్, 1,100 nits పీక్ బ్రైట్‌నెస్, DCI-P3 కలర్ గామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో G95 SoC ప్రాసెసర్, 6GB RAM, 128GB స్టోరేజ్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వంటి ఫీచర్లతో వచ్చింది.
రెండు సిమ్ కార్డ్ స్లాట్‌లు, VoLTEతో కూడిన 4G LTE, VoWiFi, డ్యుయల్ బ్యాండ్ Wi-FI ac, బ్లూటూత్ v5.1, GPS, NFC, ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ స్టీరియో స్పీకర్లు, IP53 రేటింగ్‌తో వస్తుంది. రెడ్‌మీ నోట్ 10S ఫోన్ క్వాడ్- రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart phone, POCO, Tech news, Xiaomi