Home /News /technology /

XIAOMI HAS LAUNCHED A NEW SMART BAND IN THE MARKET EYE CATCHING FEATURES HAVE A LOOK UMG GH

Mi Band 7 Pro: మార్కెట్లోకి సరికొత్త షావోమీ స్మార్ట్‌ బ్యాండ్‌.. కళ్లు చెదిరే ఫీచర్లు.. ఓ లుక్కేయండి..!

షావోమీ స్మార్ట్ బ్యాండ్

షావోమీ స్మార్ట్ బ్యాండ్

ఇండియన్ వేరబుల్ మార్కెట్‌పై మంచి పట్టు సాధించిన షావోమీ (Xiaomi) కంపెనీ.. ఎంఐ బ్యాండ్‌ 7 ప్రో (Xiaomi Mi Band 7 Pro) పేరుతో సరికొత్త స్మార్ట్‌బ్యాండ్‌ను గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ బ్రాండ్ నుంచి గతంలో వచ్చిన ఎంఐ బ్యాండ్ 7కు ప్రీమియం వెర్షన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది.

ఇంకా చదవండి ...
ఇండియన్ వేరబుల్ మార్కెట్‌పై మంచి పట్టు సాధించిన షావోమీ (Xiaomi) కంపెనీ.. ఎంఐ బ్యాండ్‌ 7 ప్రో (Xiaomi Mi Band 7 Pro) పేరుతో సరికొత్త స్మార్ట్‌బ్యాండ్‌( Smart Band)ను గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ బ్రాండ్ నుంచి గతంలో వచ్చిన ఎంఐ బ్యాండ్ 7కు ప్రీమియం వెర్షన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. ఎంఐ బ్యాండ్ 7 ప్రో బిగ్‌ స్క్రీన్‌తో వస్తుంది. దాదాపు స్మార్ట్‌వాచ్‌లా కనిపిస్తుంది. 1.64-అంగుళాల రెక్టాంగులర్‌ AMOLED డిస్‌ప్లేతో పాటు 326ppi పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడకుండా లొకేషన్-బేస్డ్ ట్రాకింగ్‌ను అందించే GPSకు సపోర్ట్‌ చేస్తుంది. ఎంఐ బ్యాండ్‌ 7 లో లేని ఫీచర్లను అందిస్తోంది.

ఎంఐ బ్యాండ్ 7 ప్రో అనేది మేలో లాంచ్‌ అయిన ఎంఐ బ్యాండ్ 7 ప్రొడక్ట్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. ఎంఐ బ్యాండ్ 7 ప్రో చైనాలో లాంచ్ అయింది. భారతదేశంలో కూడా అందుబాటులోకి రావచ్చు. దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

* ధర, లభ్యత
షావోమీ ఎంఐ బ్యాండ్‌ 7 ప్రో చైనాలో CNY 379 (దాదాపు రూ.4,500) ధరతో లాంచ్‌ అయింది. ఈ లాంచింగ్ ఆఫర్‌ జులై 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత, స్మార్ట్‌బ్యాండ్ CNY 399 (దాదాపు రూ.4,700)కు లభ్యమవుతుంది. ఇది బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పింక్, వైట్ కలర్ వేరియంట్‌లతో సహా వివిధ కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఇదీ చదవండి: Video : భర్తను వదిలి ప్రియుడు ఇంటికి..ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి చితకబాది..ఊరంతా అలా తిప్పి..

* స్పెసిఫికేషన్లు
షావోమీ ఎంఐ బ్యాండ్‌ 7 ప్రో.. 280x456 పిక్సెల్స్ రిజల్యూషన్, 326ppi పిక్సెల్ డెన్సిటీతో 1.64-అంగుళాల రెక్టాంగులర్‌ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. వాచ్ ప్రొటెక్షన్‌ కోసం పైన 2.5D గ్లాస్‌ వస్తుంది. స్మార్ట్‌బ్యాండ్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేతో రూపొందింది. ఎంఐ బ్యాండ్ 7 ప్రో ఇంటర్నెల్‌ GPSతో వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్(Smart Phone) అవసరం లేకుండానే ప్లేసెస్‌ ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.



ఎంఐ బ్యాండ్ 7 ప్రో 180 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. ఫిట్‌నెస్ ఫీచర్ల పరంగా చూస్తే.. స్మార్ట్‌బ్యాండ్ 117 ఫిట్‌నెస్ మోడ్స్‌తో వస్తుంది, ఇందులో 14 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ 7 ప్రోలో హార్ట్ రేటు, బ్లడ్-ఆక్సిజన్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకర్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ 7 ప్రో 235mAh బ్యాటరీని అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ v5.2 కనెక్టివిటీ, NFC సపోర్ట్, Xiao AI వాయిస్ అసిస్టెంట్ ఉన్నాయి. స్మార్ట్ బ్యాండ్ 5ATM వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌తో వస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Smart phones, Tech news, Xiaomi, Xiaomi Mi TV

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు