Xiomi I love Mi Offer Sale: ఫోన్ల ధరలను తగ్గించిన షియోమీ

 షియోమీ తన మొబైల్స్‌ ధరల్నీ తగ్గించనుంది. ఈ తగ్గింపును  ఐ ల‌వ్ ఎంఐ డేస్ సేల్‌‌ పేరుతో నిర్వ‌హిస్తున్న‌ది. ఈ ఆఫర్ ఈనెల 13వ తేదీన ముగియ‌నుంది.

news18-telugu
Updated: February 12, 2019, 8:30 AM IST
Xiomi I love Mi Offer Sale: ఫోన్ల ధరలను తగ్గించిన షియోమీ
Xiaomi new offer
  • Share this:
షియోమీ తన మొబైల్స్‌ ధరల్నీ తగ్గించనుంది. ఈ తగ్గింపును  ఐ ల‌వ్ ఎంఐ డేస్ సేల్‌‌ పేరుతో నిర్వ‌హిస్తున్న‌ది. ఈ ఆఫర్ ఈనెల 13వ తేదీన ముగియ‌నుంది. ఈ ఆఫర్ సేల్‌లో ప‌లు ఎంఐ ఫోన్లు, టీవీల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌ను వినియోగదారలకు అందిస్తున్నారు.  సేల్‌లో రెడ్‌మీ నోట్ 6 ప్రొకు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు ఇస్తున్నారు.  అదే కేటగిరిలో 6జీబీ ర్యామ్ వేరియెంట్‌ను రూ.14,999 ధ‌ర‌కు అందిస్తున్నారు. మరో ఫోన్.. రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్‌ను రూ.12,999 ధ‌ర‌కు ఇస్తున్నారు.  రెడ్‌మీ 6 ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.8,499 ధ‌ర‌కు షియోమీ అందిస్తోంది.  అంతేకాకుండా.. ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిష‌న్‌ను రూ.1299కు అందిస్తోంది.  43, 49 ఇంచుల ఎంఐ టీవీల‌ను రూ.22,999, రూ.30,999 ధ‌ర‌ల‌కు కొనవచ్చు.  ఈ  ఆఫర్ సేల్‌ను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో కూడా లభించనుంది.



First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...