Black Shark 2: గేమింగ్ లవర్స్‌ కోసం స్పెషల్ ఫోన్ బ్లాక్ షార్క్ 2

Black Shark 2 | బ్లాక్ షార్క్ 2 గేమింగ్ లవర్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్ గేమ్స్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవే.

news18-telugu
Updated: May 27, 2019, 4:09 PM IST
Black Shark 2: గేమింగ్ లవర్స్‌ కోసం స్పెషల్ ఫోన్ బ్లాక్ షార్క్ 2
Black Shark 2: గేమింగ్ లవర్స్‌ కోసం స్పెషల్ ఫోన్ బ్లాక్ షార్క్ 2 (Image: Black Shark China)
news18-telugu
Updated: May 27, 2019, 4:09 PM IST
మీరు గేమింగ్ లవరా? వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారా? మీ లాంటివారికోసమే బ్లాక్ షార్క్ 2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది బ్లాక్ షార్క్ కంపెనీ. చైనాకు చెందిన బ్లాక్ షార్క్ కంపెనీ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ఫండింగ్‌తో నడుస్తోంది. గేమింగ్ ఫోన్స్, యాక్సెసరీస్ తయారుచేస్తుంది ఆ కంపెనీ. బ్లాక్ షార్క్ ఇండియాలో తన తొలి స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్ 2 రిలీజ్ చేసింది. భారతదేశంలో గేమర్లను దృష్టిలో పెట్టుకొని తయారుచేసే ఫోన్లు తక్కువ. బ్లాక్ షార్క్ 2 గేమింగ్ లవర్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్ గేమ్స్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవే. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ కోసం రూపొందించిన ఫోన్ కాబట్టి ఇతర యాక్సెసరీస్‌ని ఉపయోగించుకోవచ్చు. బ్లాక్ షార్క్ 2 సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.

బ్లాక్ షార్క్ 2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.39 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే

ర్యామ్: 6 జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+12 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్-నానో
ధర:
6 జీబీ+128జీబీ- రూ.39,999
12జీబీ+256జీబీ- రూ.49,999

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...

Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...