షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. దివాళీ విత్ ఎంఐ సేల్ ప్రకటించింది షావోమీ. అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. టాప్ దివాళీ డీల్స్, దివాళీ బెస్ట్ సెల్లర్స్ పేరుతో అనేక డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇక ఈ సేల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫ్లాష్ సేల్ గురించి. ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు జరిగే సేల్‌లో ప్రతీ రోజూ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. రోజూ రెండు ప్రొడక్ట్స్ చొప్పున ఆరు రోజుల్లో 12 ప్రొడక్ట్స్‌ని ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది. రెడ్మీ నోట్ 9 ప్రో, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్‌ని కేవలం రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. మరి ఏ రోజున ఏఏ ప్రొడక్ట్స్ అమ్మనుందో వెబ్సైట్లో వివరించింది షావోమీ. మరి ఏ రోజు ఏ ప్రొడక్ట్ రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో లభిస్తుందో తెలుసుకోండి.
Redmi Note 9 Pro: అక్టోబర్ 16న సాయంత్రం 4 గంటలకు రూ.13,999 విలువైన రెడ్మీ నోట్ 9 ప్రో ఇంటర్స్టెల్లార్ బ్లాక్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 10 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Motion Activated Night Light 2: అక్టోబర్ 16న సాయంత్రం 4 గంటలకు రూ.500 విలువైన ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 ప్రొడక్ట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Poco C3: పోకో సీ3 సేల్ మొదలైంది... ధర రూ.7,000 లోపే

image: mi.com
Mi Smart Band 4: అక్టోబర్ 17న సాయంత్రం 4 గంటలకు రూ.1,899 విలువైన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ప్రొడక్ట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 25 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Redmi Note 9: అక్టోబర్ 17న సాయంత్రం 4 గంటలకు రూ.11,999 విలువైన రెడ్మీ నోట్9 స్కార్లెట్ రెడ్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 10 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi True Wireless Earphones 2: అక్టోబర్ 18న సాయంత్రం 4 గంటలకు రూ.2,999 విలువైన ఎంఐ ట్రూ వైర్లెస్ 2 ఇయర్‌ఫోన్స్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 20 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Business Casual Backpack: అక్టోబర్ 18న సాయంత్రం 4 గంటలకు రూ.899 విలువైన ఎంఐ బిజినెస్ క్యాజువల్ బ్యాక్‌ప్యాక్ రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Online Shopping Tricks: ఫెస్టివల్ సేల్‌లో ఆర్డర్స్ చేస్తున్నారా? ఈ ట్రిక్స్ మీకోసమే
Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Mi Neckband Bluetooth Earphones: అక్టోబర్ 19న సాయంత్రం 4 గంటలకు రూ.1,599 విలువైన ఎంఐ నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi TV 4A: అక్టోబర్ 19న సాయంత్రం 4 గంటలకు రూ.13,999 విలువైన ఎంఐ టీవీ 4ఏ 32 అంగుళాల హొరైజన్ ఎడిషన్ గ్రే కలర్ స్మార్ట్ టీవీని రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 20 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Beard Trimmer 1C: అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటలకు రూ.899 విలువైన ఎంఐ టీవీ బియర్ ట్రిమ్మర్ 1సీని రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Redmi SonicBass Wireless Earphones: అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటలకు రూ.999 విలువైన రెడ్మీ సోనిక్‌బాస్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Xiaomi Precision Screwdriver Kit: అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటలకు రూ.1,299 విలువైన షావోమీ ప్రెసిషన్ స్క్రూడ్రైవర్ కిట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Rechargeable LED Lamp: అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటలకు రూ.1,299 విలువైన ఎంఐ రీఛార్జబుల్ ఎల్ఈడీ ల్యాంప్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
ఈ ప్రొడక్ట్స్‌ని ఒక్క రూపాయికే సొంతం చేసుకోవాలంటే సరిగ్గా ఫ్లాష్ సేల్ సమయంలో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజూ 4 గంటలకు ఫ్లాష్ సేల్ ఉంటుంది. యూనిట్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది.