Home /News /technology /

XIAOMI CYBERDOG IN INDIA XIAOMI HAS UNVEILED THE BIO INSPIRED QUADRUPED ROBOT CYBERDOG GH SK

Xiaomi CyberDog: ఇండియాలో షావోమీ సైబర్‌డాగ్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

షావోమీ సైబర్ డాగ్ (Image:Xiomi)

షావోమీ సైబర్ డాగ్ (Image:Xiomi)

Cyber Dog: సైబర్‌డాగ్ అనేది 2021లో చైనాలో లాంచ్‌ చేసిన క్వాడ్రూప్డ్ రోబో(Quadruped Robot). షావోమీ సైబర్‌డాగ్‌ను ఓపెన్ సోర్స్ రోబోగా రూపొందించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా డెవలపర్‌లకు గొప్ప రిసోర్స్‌ను అందించగలదు.

Xiaomi CyberDog: షావోమీ (Xiaomi) కంపెనీ చాలా ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. అందులో కొన్ని మాత్రమే సంప్రదాయమైన ప్రొడక్ట్‌లు ఉన్నాయి. మరికొన్ని చాలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల కొత్తగా ఇండియాలో వస్తున్న అపడేట్స్‌లో ఓ ప్రొడక్ట్‌ సైన్స్ ఫిక్షన్ మూవీల నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. షావోమీ ఇండియా 8వ వార్షికోత్సవంలో భాగంగా, ప్రత్యేకంగా డిజైన్ చేసిన సైబర్‌ డాగ్‌ (CyberDog) ఓపెన్ సోర్స్ రోబోను ప్రదర్శించింది.

iPhone 13: అబ్బా.. ఐఫోన్ అదిరిపోయే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.3,599కే సొంతం.. ఇంకెందుకు ఆలస్యం.. ఓ లుక్కేయండీ

* ఇండియాలో షావోమీ CyberDogని ఎక్కడ చూడవచ్చు
సైబర్‌డాగ్ అనేది 2021లో చైనాలో లాంచ్‌ చేసిన క్వాడ్రూప్డ్ రోబో(Quadruped Robot). షావోమీ సైబర్‌డాగ్‌ను ఓపెన్ సోర్స్ రోబోగా రూపొందించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా డెవలపర్‌లకు గొప్ప రిసోర్స్‌ను అందించగలదు. చైనీస్ కంపెనీ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లోని ఎంఐ హోమ్ అవుట్‌లెట్లలో సైబర్‌డాగ్‌ను ప్రదర్శించనుంది.

Smart Phone: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్ ఇదే.. ఎందుకంత డిమాండ్? ప్రత్యేకతలేంటి?* సైబర్ డాగ్ సెన్సార్లు
సైబర్‌డాగ్ అనేది రోబోటిక్స్ విభాగంలో షావోమీ తీసుకొచ్చిన మొదటి ప్రొడక్ట్‌. సంస్థ చేస్తున్న పరిశోధన ప్రయత్నాలను ఇది తెలియజేస్తుంది. క్వాడ్రూప్డ్ రోబోటిక్స్‌లో పరిశోధనలు పెరుగుతున్నాయి.. ఈ రంగంలో తన లైనప్‌ను విస్తరించాలని షావోమీ భావిస్తోంది. జెట్సన్ జేవియర్ NX AI సూపర్ కంప్యూటర్‌ బేస్‌ చేసుకుని సైబర్‌డాగ్ ఎంబెడెడ్ ఎడ్జ్ సిస్టమ్‌ పని చేస్తుంది. ఇది 128GB SSD స్టోరేజ్‌, 11 హై-ప్రెసిషన్ సెన్సార్‌లతో రూపొందింది. సెన్సార్ ఇన్‌స్టాంట్‌ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇది రోబో భూమిపై సులువుగా నావిగేట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. షియోమి సైబర్‌డాగ్‌ చురుకైనది, సంక్లిష్టమైన భూభాగానికి అనుగుణంగా ఉంటుంది. సైబర్‌డాగ్ దాని వెర్సటాలిటీతో పర్ఫెక్ట్ పార్ట్నర్‌గా ఉంటుందని షియోమి పేర్కొంది.* సైబర్‌డాగ్‌ స్కిల్స్‌
షావోమీ సైబర్‌డాగ్ స్మార్ట్‌ఫోన్ ఇమేజింగ్ టెక్నాలజీతో వస్తుంది, వాతావరణాన్ని తెలివిగా గ్రహిస్తుంది. AI ఇంటరాక్టివ్ సెన్సార్‌లు, బైనాక్యులర్ అల్ట్రా-వైడ్-యాంగిల్ ఫిష్‌ఐ కెమెరాలు, ఇంటెల్ డెప్త్ మాడ్యూల్‌ ఉంటాయి. సబైర్‌డాగ్‌ దాని కంప్యూటర్ విజన్ అల్గారిథమ్ ఉపయోగించి శిక్షణ పొందవచ్చు. రోబో అటానమస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్, హ్యూమన్ పోస్చర్, ఫేస్ రికగ్నిషన్, అడ్డంకులను అధిగమించడం, SLAM వంటి లక్షణాలు ఉన్నాయి. సైబర్‌డాగ్ రియల్ టైమ్‌ సమాచారం ఉపయోగించి దాని పరిసరాలను విశ్లేషించగలదు, నావిగేట్ చేయగలదు. ఇది నావిగేషనల్ మ్యాప్‌లను క్రియేట్‌ చేసుకుని, అడ్డంకులను తప్పించుకుంటూ గమ్యాన్ని చేరుకునేందుకు ప్లాన్ చేస్తుంది.

Nord 2T Smartphone: కాసేపట్లో అమెజాన్ లో Nord 2T స్మార్ట్ ఫోన్ సేల్.. బడ్జెట్ ధరలో అందుబాటులోకి..

షావోమీ సైబర్‌ డాగ్‌ ఓపెన్-సోర్స్ పొటెన్షియాలిటీ రోబోను గ్రేటర్‌ ఫంక్షనాలిటీకి అన్‌లాక్ చేయగలదు. దీన్ని డెవలపర్‌లు దాని USB, HDMI పోర్ట్‌ల ద్వారా కస్టమైజ్‌ చేయవచ్చు. అలాంటి ఓపెనింగ్‌తో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ యాడ్-ఆన్‌లు, ఫంక్షన్‌లు రెండూ సాధ్యమే. షావోమీ సైబర్‌డాగ్‌ దాని కదలికలో రోబో వేగం, చురుకుదనం, విభిన్నతను అందించే షావోమీ సర్వో మోటార్‌లతో రూపొందింది. ఇది 3.2m/s (11.52km/hకి సమానం) వేగంతో చేరుకోగలదు. బ్యాక్‌ఫ్లిప్పింగ్ కూడా చేయగలదు. ఈ సైబర్‌ డాగ్‌ వాయిస్ కమాండ్స్‌ కూడా వినగలదు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Technology, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు