Xiaomi Mi A3: ఆగస్ట్ 23న షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఫీచర్లు ఇవే

Xiaomi Mi A3 | ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ గత నెలలోనే స్పెయిన్‌లో రిలీజైంది. దీంతో ఎంఐ ఏ3 ఫీచర్స్ అందరికీ తెలుసు.

news18-telugu
Updated: August 12, 2019, 6:27 PM IST
Xiaomi Mi A3: ఆగస్ట్ 23న షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఫీచర్లు ఇవే
Xiaomi Mi A3: ఆగస్ట్ 23న షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఫీచర్లు ఇవే
  • Share this:
షావోమీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. షావోమీ ఆండ్రాయిడ్ వన్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాకు రాబోతోంది. ఇప్పటికే ఇండియాలో ఎంఐ ఏ1, ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. త్వరలో ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది షావోమీ. ఆగస్ట్ 23న ఇండియాలో ఎంఐ ఏ3 రిలీజ్ కావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ గత నెలలోనే స్పెయిన్‌లో రిలీజైంది. దీంతో ఎంఐ ఏ3 ఫీచర్స్ అందరికీ తెలుసు. టియర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 18వాట్ ఛార్జర్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.

షావోమీ ఎంఐ ఏ3 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.1 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 48+8+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,030 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
కలర్స్: బ్లూ, వైట్, గ్రే
ధర:
4జీబీ+64జీబీ- సుమారు రూ.19,300
6జీబీ+128జీబీ-సుమారు రూ.21,600

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

WhatsApp: షాక్... మీ వాట్సప్ హ్యాక్ చేయొచ్చు... ఈ వీడియోనే సాక్ష్యం

JIO GigaFiber: జియో గిగాఫైబర్‌తో 4K టీవీ, 4K సెట్ టాప్ బాక్స్ ఉచితం

WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే
Published by: Santhosh Kumar S
First published: August 12, 2019, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading