Xiaomi: సెల్ఫీ లవర్స్‌కు గుడ్ న్యూస్... షావోమీ నుంచి 32 మెగాపిక్సెల్ ఫోన్

Redmi Y3 | ఏప్రిల్ 24న కొత్త ఫోన్లు రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది షావోమీ. అది కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అని అఫీషియల్‌గా ప్రకటించింది.

news18-telugu
Updated: April 16, 2019, 9:22 AM IST
Xiaomi: సెల్ఫీ లవర్స్‌కు గుడ్ న్యూస్... షావోమీ నుంచి 32 మెగాపిక్సెల్ ఫోన్
Xiaomi: సెల్ఫీ లవర్స్‌కు గుడ్ న్యూస్... షావోమీ నుంచి 32 మెగాపిక్సెల్ ఫోన్
  • Share this:
మీరు సెల్ఫీ లవర్సా? రోజూ సెల్ఫీలు తీసుకొని ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారా? సెల్ఫీ బాగా రావాలంటే మంచి కెమెరా ఉండాలి. అందుకే సెల్ఫీ లవర్స్ కోసం షావోమీ సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది. కొద్దిరోజుల క్రితమే రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ గో రిలీజ్ చేసిన షావోమీ... ఇక ఇండియాలో Y సిరీస్ ఫోన్లు లాంఛ్ చేసందుకు రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 24న కొత్త ఫోన్లు రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అది కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అని అఫీషియల్‌గా ప్రకటించింది.

రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్ టీజర్ చూస్తే రెడ్‌మీ నోట్ 7 లాగే డాట్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. షావోమీ రెడ్‌మీ వై సిరీస్ స్మార్ట్‌ఫోన్లు సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్లు. రెడ్‌మీ వై1, రెడ్‌మీ వై2 అలాగే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రెడ్‌మీ వై3 కూడా సెల్ఫీ లవర్స్ కోసం వస్తున్న ఫోన్. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది షావోమీ. మరి మిగతా స్పెసిఫికేషన్స్ తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 24న షావోమీ ఎన్ని ఫోన్లు రిలీజ్ చేస్తుందో చూడాలి.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

ASUS OMG Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసుస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్... ఆఫర్లు ఇవే

Samsung Jio Offer: రేపు సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్... రూ.3,110 జియో బెనిఫిట్స్

ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్
First published: April 16, 2019, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading